Fake News, Telugu
 

వివిధ సంస్థల పేర్లతో GHMC ఎన్నికలకు సంబంధించి ఫేక్ సర్వేలను షేర్ చేస్తున్నారు.

0

డిసెంబర్ 1న GHMC ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కో పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్తూ, వివిధ సంస్థల పేర్లతో ఎన్నో సర్వేలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన వారు తమ పార్టీ గెలవబోతుందని చెప్తూ, తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నట్టు ఈ సర్వే లను చూపెడుతున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2020 GHMC ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల ఫలితాలు.

ఫాక్ట్:  తమ పేర్లతో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నవి ఫేక్ సర్వేలని ‘CNN న్యూస్18’  మరియు ‘V6 న్యూస్’ సంస్థలు తెలిపాయి. ‘ఏబీపీ – సీ ఓటర్’ పేరుతో షేర్ అవుతున్న సర్వేకి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

‘CNN న్యూస్18’ సర్వే: (ఆర్కైవ్డ్)

‘CNN న్యూస్18’ సంస్థ అటువంటి సర్వే ఏదైనా నిర్వహించిందా అని ఇంటర్నెట్ లో వెతకగా, తాము అలాంటి సర్వే ఏదీ కూడా జరపలేదని, సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది ఒక ఫేక్ రిపోర్ట్ అని ‘CNN న్యూస్18’ సంస్థ వారు తెలిపినట్టు తెలుస్తుంది. ఇదే విషయం చెప్తూ, ‘CNN న్యూస్18’ సంస్థ వారు తమ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసారు.

‘V6 న్యూస్’ సర్వే: (ఆర్కైవ్డ్)

GHMC ఎన్నికలకు సంబంధించి తమ పేరుతో సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది ఫేక్ సర్వే అని ‘V6 న్యూస్’ సంస్థ వారు తెలిపారు. ‘సర్వే చేస్తే V6 టీవీ, వెలుగు పత్రికతో పాటు V6 సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ల ద్వారా బాహాటంగా వెల్లడిస్తాము’ అని చెప్పారు

ఇతర సర్వేలు:

‘ఏబీపీ – సీ ఓటర్’ పేరుతో మరొక సర్వేను (ఆర్కైవ్డ్) కూడా సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, సీ ఓటర్’ వారు అలాంటి సర్వే నిర్వహించినట్టు ఎక్కడా కూడా పోస్ట్ చేయలేదు. ఈ విషయం పై ‘సీ ఓటర్’ వారిని సంప్రదించడానికి FACTLY ప్రయత్నించింది; వారి దగ్గరి నుండి సమాధానం వచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది. ‘చాణక్య’ (ఆర్కైవ్డ్) మరియు ‘ఆక్సిస్ ఇండియా’ (ఆర్కైవ్డ్) పేర్లతో కూడా సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు షేర్ చేయబడుతున్నాయి. అయితే, ఆ సర్వే లకు సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం దొరకలేదు.

చివరగా, వివిధ సంస్థల పేర్లతో GHMC ఎన్నికలకు సంబంధించి ఫేక్ సర్వేలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll