Fake News, Telugu
 

‘1945 లో దాడి చేసినందుకు ఇప్పటికీ అమెరికా వస్తువులను జపాన్ కొనట్లేదు’ అనేది ఫేక్ మెసేజ్

0

1945 లో జపాన్ పై అమెరికా న్యూక్లియర్ బాంబ్ తో దాడి చేసినప్పటి నుండి నేటి వరకు జపాన్ ప్రజలు అసలు అమెరికా వస్తువులు కొనడం లేదని, కనీసం గుండు పిన్ను కూడా అమెరికా అమ్మలేకపోయింది అని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1945 లో న్యూక్లియర్ బాంబ్ తో దాడి చేసారని, ఈ రోజుకీ కూడా అమెరికా వస్తువులను జపాన్ కొనట్లేదు. 

ఫాక్ట్ (నిజం): ): 2019 లో అమెరికా కి జపాన్ నాల్గవ అతి పెద్ద ఎగుమతి మార్కెట్. సుమారు 74.7 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువు గల వస్తువులను 2019 లో అమెరికా జపాన్ కి ఎగుమతి చేసిందని ‘Office of the United States Trade Representative’ వెబ్సైటులో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

అమెరికా మరియు జపాన్ మధ్య జరిగే ట్రేడ్ గురించిన సమాచరం కోసం వెతకగా, ‘Office of U.S. Trade Representative’ వెబ్ సైట్ లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం, రెండు దేశాల మధ్య సుమారు 303 బిలియన్ అమెరికన్ డాలర్ల ట్రేడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 2019 లో అమెరికా జపాన్ కి సుమారు 123.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువు గల వస్తువులు మరియు సర్వీసెస్లను (వస్తువులు – 74.7 బిలియన్ అమెరికన్ డాలర్లు మరియు సర్వీసెస్ – 48.7 అమెరికన్ డాలర్ల) ఎగుమతి చేసింది. పోస్ట్ లోని మెసేజ్ 2019 లో కూడా వైరల్ అవ్వగా, అప్పుడు FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ని క్కడ చూడవొచ్చు.

అమెరికా మరియు జపాన్ ట్రేడ్ గణాంకాలను ‘Ministry of Finance – Japan’ వెబ్ సైట్ లో కూడా చూడవొచ్చు.

అంతేకాదు, జపాన్‌లో ఉన్న అత్యంత ప్రసిద్ధ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ‘అమెజాన్’ (ఒక అమెరికన్ సంస్థ) ఒకటని తెలుస్తుంది. అనేక యుఎస్ కంపెనీల ఉత్పత్తులువెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉన్నట్టు చూడవొచ్చు.

చివరగా, ‘1945 లో దాడి చేసినందుకు ఇప్పటికీ అమెరికా వస్తువులను జపాన్ ప్రజలు కొనట్లేదు’ అనేది ఫేక్ మెసేజ్. 2019 లో అమెరికా జపాన్ కి సుమారు 74.7 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువు గల వస్తువులను ఎగుమతి చేసింది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll