Fake News, Telugu
 

ప్రియాంకా గాంధీ పుట్టిన రోజుకు సంబంధించి అసత్యాలను వ్యంగ్యంగా షేర్ చేస్తున్నారు

0

ప్రియాంక గాంధీ పుట్టిన తేదీ 12 జనవరి 1971 అని రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వైరల్ పోస్టులో ప్రియాంకా పుట్టిన తేదీని, రాహుల్ గాంధీ పుట్టిన తేదీతో (19 జూన్ 1970) పోలుస్తూ ఏడు నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టారంటూ వ్యంగంగా షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రియాంకా గాంధీ పుట్టిన తేదీ వివరాలు.

ఫాక్ట్(నిజం):  ప్రియాంకా గాంధీ 12 జనవరి 1972లో జన్మించింది. గత నెల ఆమె పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఒక వీడియోలో కూడా ఆమె పుట్టిన తేదీ 12 జనవరి 1972గా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం కూడా ప్రియాంకా గాంధీ 1972 జనవరిలో జన్మించినట్టు రుజువు చేస్తున్నాయి. ఐతే వైరల్ స్క్రీన్ షాట్‌లో పొరపాటున ఆమె పుట్టిన సంవత్సరం 1971గా పేర్కొని ఉండవచ్చు. ఈ పొరపాటుని  కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వ్యంగంగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ స్క్రీన్ షాట్‌లో ప్రియాంకా గాంధీ 12 జనవరి 1971లో జన్మించినట్టు ఉంది. కాని నిజానికి ప్రియాంకా గాంధీ 12 జనవరి 1972న ఢిల్లీలో జన్మించింది. గత నెల ఆమె పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఒక వీడియోలో కూడా ఆమె పుట్టిన తేదీ 12 జనవరి 1972గా పేర్కొన్నారు.

అలాగే వార్తా పత్రికల్లో, లేక ఇంటర్నెట్‌లో ఆమెకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారంలో కూడా ఆమె పుట్టిన తేదీ 12 జనవరి 1972గానే ఉంది (ఇక్కడ మరియు ఇక్కడ).  గాంధీ కుటుంభానికి సంబంధించి కొన్ని పుస్తకాలలో కూడా ఆమె పుట్టిన సంవత్సరం 1972గానే ఉంది (ఇక్కడ మరియు ఇక్కడ).  దీన్నిబట్టి, ఆమె పుట్టిన సంవత్సరం 1972 అని స్పష్టమవుతుంది.

రాహుల్ గాంధీ పుట్టిన (19 జూన్ 1970) సుమారు 18 నెలల తరవాత ప్రియాంకా గాంధీ జన్మించింది. ఐతే వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్‌లో పొరపాటున ఆమె పుట్టిన సంవత్సరం 1971గా పేర్కొని ఉండవచ్చు. ఈ పొరపాటుని  కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వ్యంగంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ప్రియాంకా గాంధీ పుట్టిన రోజుకు సంబంధించి అసత్యాలను వ్యంగ్యంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll