Fake News, Telugu
 

వరదల్లో కొట్టుకుపోతున్న ఈ పిల్లలను కాపాడింది వాళ్ళ తండ్రి కాదు, అక్కడే ఉన్న మరొక వ్యక్తి

0

వరదల్లో కొట్టుకుపోతున్న తన ఇద్దరు పిల్లల్ని తండ్రి కాపాడాడంటూ, ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లల్ని కాపాడిన వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఒక తండ్రి వరదల్లో కొట్టుకుపోతున్న తన ఇద్దరు పిల్లల్ని కాపాడిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం):  వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు ఇటీవల ఒమన్ దేశంలోని బహ్లా పట్టణంలో జరిగిన ఘటనకు సంబంధించినవి. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఆ పిల్లల్ని కాపాడింది వాళ్ళ తండ్రి కాదు, అక్కడే ఉన్న అలీ బిన్ నాసర్ అల్-వార్ది అనే ఒక ఫోటోగ్రాఫర్. ఇదే విషయాన్ని అక్కడి వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వరదల్లో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లల్ని ఒక వ్యక్తి కాపాడిన ఈ ఘటన ఒమన్ దేశంలోని బహ్లా పట్టణంలో జరిగింది. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఆ ఇద్దురు పిల్లల్ని కాపాడిన వ్యక్తి వాళ్ళ తండ్రి కాదు.

వైరల్ అవుతున్న ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను రిపోర్ట్ చేసిన పలు ఒమన్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. అలాంటి ఒక కథనం ప్రకారం ఆ పిల్లల్ని కాపాడింది అక్కడే ఉన్న వేరొక వ్యక్తి, వాళ్ళ తండ్రి కాదు. ఆ కాపాడిన వ్యక్తి పేరు అలీ బిన్ నాసర్ అల్-వార్ది, అతను ఒక ఫోటోగ్రాఫర్, ఘటన జరిగిన సమయంలో అతను అక్కడే ఉన్నాడంటూ వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఘటన జరిగిన సమయంలో ఆ పిల్లల తండ్రి కూడా అక్కడే ఉన్నాడు.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన వేరొక వార్తా కథనంలో కూడా పిల్లల్ని కాపాడింది అలీ బిన్ నాసర్ అల్-వార్ది అని స్పష్టంగా పేర్కొంది. అలాగే అలీ బిన్ నాసర్ అల్-వార్దిను అక్కడి ప్రజలు మరియు ప్రభుత్వం అభినందించినట్లు కూడా ఈ కథనంలో రిపోర్ట్ చేసింది. ఈ వార్తా కథనాల బట్టి, వైరల్ పోస్టులో చెప్తున్నట్టు పిల్లల్ని కాపాడింది, వాళ్ళ తండ్రి కాదని స్పష్టమవుతుంది.

చివరగా, వరదల్లో కొట్టుకుపోతున్న ఈ పిల్లలను కాపాడింది వాళ్ళ తండ్రి కాదు, అక్కడే ఉన్న మరొక వ్యక్తి.

Share.

About Author

Comments are closed.

scroll