విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో ఈ రోజు ఉదయం విషపూరితమైన స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు అస్వస్థకు గురయ్యారు. ఈ తరుణంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండో సారి గ్యాస్ లీక్ అయ్యిందని ఆ దుర్ఘటనను లైవ్ లో కవర్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. అయితే, అవన్నీ వదంతులని, ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండో సారి గ్యాస్ లీక్ అవ్వలేదని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేసారు. ఎల్‌జీ పరిశ్రమలో మెయింటెనెన్స్ టీమ్ మరమ్మతులు చేస్తున్న సమయంలో కొంత ఆవిరిని బయటకు పంపించారని తెలిపారు. కావున, విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండో సారి లీక్ అయ్యిందని చెప్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
సోర్సెస్:
క్లెయిమ్: యూట్యూబ్ వీడియో (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: ఏపీ పోలీస్ ట్వీట్ – https://twitter.com/APPOLICE100/status/1258297197281476609
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?