భారత రెజ్లర్ నిషా దహియా హత్య చేయబడిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన హర్యానాకు చెందిన నిషా దహియా, ఆమె సోదరుడు కాల్పుల్లో చనిపోయారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ నిషా దహియా హత్య చేయబడింది.
ఫాక్ట్ (నిజం): తాను బతికే ఉన్నానని నిషా దహియా తను సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ద్వారా తెలిపింది. ఇటీవల బెల్‌గ్రేడ్‌లో జరిగిన అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన నిషా దహియా హత్యచేయబడలేదని, హత్యకు గురైన మహిళ అదే పేరుతో ఉన్న ఒక ట్రైనీ రెజ్లర్ అని తేలింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, నిషా దహియా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి లభించింది. తాను జీవించే ఉన్నానని నిషా దహియా వీడియో ద్వారా తెలిపింది. “నేను ప్రస్తుతం గోండాలో సీనియర్ లెవెల్ మ్యాచ్ లు ఆడేందుకు వచ్చాను. కాబట్టి, నేను చనిపోయానని వచ్చిన న్యూస్ ఫేక్” అని నిషా దహియా స్పష్టం చేసింది.
సోనిపత్‌లోని ఒక అకాడమీ వెలుపల నిషా కాల్చి చంపబడిందని వార్తలు వచ్చినప్పుడు వందలాది మంది తోటి రెజ్లర్లు, కోచ్ లు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఇటీవల బెల్‌గ్రేడ్‌లో జరిగిన అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన నిషా దహియా హత్య చేయబడలేదని, హత్యకు గురైన మహిళ అదే పేరుతో ఉన్న ట్రైనీ రెజ్లర్ అని తేలింది.
చివరగా, అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన నిషా దహియా హత్య చేయబడలేదు, హత్యకు గురైన మహిళ అదే పేరుతో ఉన్న ఒక ట్రైనీ రెజ్లర్.