Fake News, Telugu
 

‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ నూడుల్స్ ఫోటో భారత దేశానికి సంబంధించింది కాదు

0

నెస్లే కంపెనీ  మాగీ నూడుల్స్ ని ‘భారత దేశం లో బీఫ్’ ఫ్లేవర్ లో అమ్ముతుందని క్లెయిమ్ చేస్తూ  ఒక పోస్ట్ ఫేస్ బుక్ లో ప్రచారం అవుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: నెస్లే కంపెనీ మాగీ నూడుల్స్ ని భారత దేశం లో ‘బీఫ్’ ఫ్లేవర్ లో అమ్ముతుంది.

ఫాక్ట్ (నిజం): నెస్లే ఇండియా వెబ్సైటు లో, భారత దేశం లో ఆ కంపెనీ అమ్ముతున్న ఉత్పత్తుల జాబితాలో ‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ లిస్ట్ అయ్యి లేదు. నెస్లే కంపెనీ ‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ నూడుల్స్ ఉత్పత్తులని ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో అమ్ముతుంది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

భారత దేశం లో నెస్లే కంపెనీ అమ్ముతున్న ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి నెస్లే ఇండియా వెబ్సైట్ లోకి వెళితే, ఆ జాబితాలో ‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ  లేదు. మాంసాహార విభాగంలో, కేవలం ‘చికెన్’ ఫ్లేవర్ ఉన్న మాగీ ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి.

అంతేకాక, ట్విట్టర్ లో ఒకాయన నెస్లే ని, ఆ కంపెనీ భారత దేశం లో మాగీ నూడుల్స్ ని ‘బీఫ్’ ఫ్లేవర్ లో అమ్ముతుందా అని అడిగితే, బదులుగా నెస్లే ఇండియా కేర్ తాము భారత దేశంలో తయారు చేసే మరియు అమ్మే ఏ మాగీ నూడుల్స్ లోనూ బీఫ్ కానీ బీఫ్ ఫ్లేవర్ కానీ ఉండదని స్పష్టం చేసింది. 

నెస్లే కంపెనీ ‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ నూడుల్స్ ఉత్పత్తులని ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో అమ్ముతుందని తెలిసింది. పోస్ట్ లోని ఫోటో లో ఉన్నటువంటి మాగీ నూడుల్స్ ని న్యూజీలాండ్ లో అమ్ముతున్న వెబ్సైటులో చూడవొచ్చు.

చివరగా, పోస్టులో షేర్ చేసిన ‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ నూడుల్స్ ఫోటో భారత దేశానికి సంబంధించింది కాదు. అసలు నెస్లే కంపెనీ భారత దేశం లో ‘బీఫ్’ ఫ్లేవర్ ఉన్న మాగీ నూడుల్స్ ని అమ్మదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll