Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

స్కూళ్ళు మరియు కాలేజీలు బేసి/సరి సంఖ్య ఆధారంగా తెరవాలని చెప్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చెయ్యలేదు

0

‘పాఠశాలలూ మరియు కళాశాలలూ జూన్ 1 నుండి బేసి/సరి ప్రాతిపదికన తిరిగి తెరవాలి. బేసి రోజుల్లో ఉపాధ్యాయులు వస్తారు మరియు సరి రోజుల్లో విద్యార్థులు వస్తారు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేసినట్లుగా ఆయన పేరు మీద ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతోంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ‘పాఠశాలలూ మరియు కళాశాలలూ జూన్ 1 నుండి బేసి/సరి ప్రాతిపదికన తిరిగి తెరవాలి. బేసి రోజుల్లో ఉపాధ్యాయులు వస్తారు మరియు సరి రోజుల్లో విద్యార్థులు వస్తారు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు. 

ఫాక్ట్ (నిజం): స్కూళ్ళు మరియు కాలేజీలు బేసి/సరి సంఖ్య ఆధారంగా తెరవాలని చెప్తూ రాహుల్ గాంధీ పోస్టులోని ట్వీట్ చెయ్యలేదు. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లోని పదాల ఓరియంటేషన్ మరియు ట్విట్టర్ లోని ఒక ట్వీట్ లోని పదాల ఓరియంటేషన్ పోల్చినప్పుడు చాలా తేడాలను చూడవచ్చు. కావున, స్క్రీన్ షాట్ లోని ట్వీట్ డిజిటల్ గా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేరు సహాయంతో రూపొందించబడింది. అందుకే పోస్టు లో చెప్పింది తప్పు. 

పోస్టు లోని స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ రాహుల్ గాంధీ చేసాడా అని ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ చేసినప్పుడు, ఆయన అలాంటి ట్వీట్ చేసినట్లుగా సమాచారమేమి లభించలేదు. అయితే, స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ని మరియు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ అకౌంట్ లోని ట్వీట్ ని పోల్చినప్పుడు చాలా తేడాలు కనిపించాయి.

  1. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లోని పదాల ఓరియంటేషన్ మరియు ట్విట్టర్ లోని ట్వీట్ లోని పదాల ఓరియంటేషన్ వేరు గా ఉన్నాయి.
  2. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లో టైం స్టాంప్ ట్విట్టర్ స్టాండర్డ్ పద్ధతిలో లేదు. ట్విట్టర్ లో టైం స్టాంప్ ‘నెల తేది, సంవత్సరం’ పద్ధతిలో ఉంటుంది.
  3. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లో ట్వీట్ ‘Nokia E75’ నుండి పెట్టినట్లుగా ఉంటుంది కానీ, రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ లోని ట్వీట్ లు ‘iPhone’ నుండి పెట్టినట్లుగా చూడవచ్చు.

చివరగా, స్కూళ్ళు మరియు కాలేజీలు బేసి/సరి సంఖ్య ఆధారంగా తెరవాలని చెప్తూ రాహుల్ గాంధీ పోస్టులోని ట్వీట్ చెయ్యలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll