Fake News, Telugu
 

ఇటీవల ఇజ్రాయిల్ కూల్చివేసిన గాజా బిల్డింగ్‌లో NDTV, ఇండియా టుడే ఆఫీసులు లేవు

0

ఇటీవల ఇజ్రాయిల్ కూల్చివేసిన గాజాలోని ఒక బిల్డింగ్‌లో అల్-జజీరా ఛానల్ మరియు భారత్ కు చెందిన మీడియా సంస్థలు NDTV, ఇండియా టుడే ఆఫీసులు కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇజ్రాయిల్ కూల్చివేసిన గాజా బిల్డింగ్‌లో NDTV, ఇండియా టుడే ఆఫీసులు కూడా ఉన్నాయి.

ఫాక్ట్: ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్ తొ గాజాలోని బిల్డింగ్‌ కూల్చివేతకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో వెతికినప్పుడు, కూలిన బిల్డింగ్‌లో NDTV, ఇండియా టుడే మీడియా సంస్థల ఆఫీసులు ఉన్నట్టు ఎక్కడా తెలపలేదు. కావున, పోస్ట్ల ద్వారా చెప్పేది తప్పు.

గాజా లో జరిగిన బిల్డింగ్‌ కూల్చివేత కు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో వెతికినప్పుడు, కొన్ని వివరాలు లభించాయి. అందులో CNN వారు ప్రచురించిన ఆర్టికల్ లో NDTV, ఇండియా టుడే మీడియా సంస్థల ఆఫీసులు ఉన్నట్టు తెలపలేదు. ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్ గాజాలోని ఏపీ (AP) , అల్-జజీరా ఆఫీసులు ఉన్న భవనాన్ని కూల్చివేసిందని తెలిసింది. ఈ ఆర్టికల్ లో ఇండియన్ మీడియా సంస్థల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఈ ఘటనకు సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ సంఘటనకు సంబంధించి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వారు తమ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వివరించారు. గాజాలోని అల్ జాలా టవర్ లో హమాస్ సైనిక ఇంటెల్ స్థావరంగా వారు గుర్తించారని, ఆ బిల్డింగ్ లో ఉన్న పౌరులని హెచ్చరించారని, సురక్షితంగా ఖాళీ చేయడానికి వారికి తగినంత సమయం ఇచ్చామని తెలిపారు. ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా దాడులు చేస్తున్నప్పుడు హమాస్ టెర్రరిస్టులు పౌరులు మధ్య దాక్కోవడానికి ఎంచుకుంటున్నారని కూడా ట్వీట్ చేసారు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వారి వెబ్ సైట్ ద్వారా కూడా గాజాలో జరిగిన స్ట్రైక్ గురించి వివరించారు.

ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి అయిన బెంజమిన్ నేతన్యాహు ఈ ఘటనకు సంబంధించి స్పందించినట్టు ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. కాని, ఆ ఆర్టికల్ లో భారత మీడియా సంస్థలు అయిన NDTV మరియు ఇండియా టుడే గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. స్ట్రైక్ జరగబోతుంది అని అందులో ఉన్న జర్నలిస్ట్ లకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకో న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

ఎడిటర్స్ గిల్డ్, ఇతర భారతీయ జర్నలిస్ట్ సంస్థలు గాజా లోని ఏపీ, అల్-జజీరా ఆఫీసులు ఉంటున్న బిల్డింగ్ పై ఇజ్రాయిల్ చేసిన స్ట్రైక్ ని ఖండించాయి. ఈ స్ట్రైక్ వెనుక నిర్ణయం తీసుకోవడాన్ని గురించి దర్యాప్తు జరగాలని ఎడిటర్స్ గిల్డ్ వారు కోరినట్టు న్యూస్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇందులో కూడా NDTV మరియు ఇండియా టుడే కు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఈ విషయానికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఇటీవల ఇజ్రాయిల్ కూల్చివేసిన గాజా బిల్డింగ్‌లో NDTV, ఇండియా టుడే ఆఫీసులు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll