Fake News, Telugu
 

ఫోటోలో మలాలా గురించి ఉన్న పాఠం కేంద్ర ప్రభుత్వం వారి NCERT ఆరవ తరగతి పుస్తకాల్లో లేదు

0

పాకిస్తానీ మహిళ అయిన మలాలా యూసుఫ్ జాయ్ ఒక ‘భారత వ్యతిరేకి’ అని, తన గురించి కేంద్ర ప్రభుత్వం వారి NCERT ఆరవ తరగతి పుస్తకంలో పొగుడుతూ తప్పుడు చరిత్ర భోధిస్తున్నారని ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

 ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలో మలాలా యూసుఫ్ జాయ్ గురించి ఉన్న పాఠం ప్రభుత్వం వారి NCERT ఆరవ తరగతి పుస్తకంలోనిది.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న పాఠం NCERT ఆరవ తరగతి పుస్తకాల్లో లేదు. ఆ పాఠం ICSE సిలబస్ ఆధారంగా ‘ఆక్స్ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్’ వారు ప్రచురించిన ‘ICSE EDITION: New Mulberry English Course – Coursebook 6’ లోనిది. కావున పోస్ట్ లో ఆ పాఠం కేంద్ర ప్రభుత్వం వారి NCERT పుస్తకంలోనిదని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో పెట్టిన పాఠం గురించి NCERT ఆరవ తరగతి పుస్తకాల్లో వెతకగా, ఎక్కడా కూడా ఆ పాఠం దొరకలేదు. NCERT ఆరవ తరగతి ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉన్న పాఠాల గురించి కింద ఫోటోలో చూడవొచ్చు. పోస్ట్ లోని ఫోటోలోని ‘Leaving the valley’ పాఠం వాటిల్లో లేనట్టు తెలుస్తుంది.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకినా కూడా ఆ పాఠం గురించిన వివరాలు దొరకలేదు. అయితే, ఆ పాఠం లోని కొన్ని పదాలు తీసుకొని వెతకగా, ఆ పాఠం ఉన్న పుస్తకం యొక్క లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఫోటోలోని ‘Leaving the valley’ పాఠం ‘ఆక్స్ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్’ వారి ‘ICSE EDITION: New Mulberry English Course – Coursebook 6’ లోనిదని తెలుస్తుంది.

‘Council for the Indian School Certificate Examinations (CISCE)’ వారి ఆరవ మరియు ఏడవ తరగతి ‘ఇంగ్లీష్ లిటరేచర్’ సిలబస్ రీడింగ్ లిస్టులో ‘I am Malala – Malala Yousafzai’ ఉన్నట్టు చూడవచ్చు. CISCE అనేది ప్రభుత్వ సంస్థ కాదు. కానీ, భారత్ లో ‘Delhi School Education Act 1973’ కింద పబ్లిక్ పరీక్షలు (ICSE, ISC మరియు C.V.E) నిర్వహిస్తున్నట్టు వారి వెబ్సైటులో చదవొచ్చు.

ICSE సిలబస్ ఆధారంగా రూపొందించిన పియర్సన్ సంస్థ వారి ‘Lighthouse Coursebook 6’ లో కూడా మాలాల పై పాఠం ఉన్నట్టు చూడవొచ్చు.

అయితే, కొన్ని CBSE స్కూల్స్ లో భోధించే ‘New Gem’s English Reader Work Book Class – 6’ లో కూడా మాలాల పై పాఠం ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, NCERT కి సంబంధించిన తొమ్మిదవ తరగతి ‘Words and Expressions – 1’ ఇంగ్లీష్ పుస్తకంలో ఆరవ పాఠం లో ఒక ప్రశ్న లో భాగంగా మాలాల యూఎన్ జనరల్ అసెంబ్లీ లో ఇచ్చిన ప్రసంగం ఇచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు. కానీ పోస్ట్ లో చెప్పినట్టు NCERT పుస్తకాల్లో మాలాల పై పాఠం లేదు.

చివరగా, ఫోటోలో మలాలా గురించి ఉన్న పాఠం ప్రభుత్వం వారి NCERT ఆరవ తరగతి పుస్తకాల్లో లేదు.

Share.

About Author

Comments are closed.

scroll