Fake News, Telugu
 

కేరళ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన స్వప్న సురేష్ చేతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరు పచ్చబొట్టుగా లేదు

0

కేరళ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన స్వప్న సురేష్ వేసుకున్న పచ్చబోట్టు ఫోటోని హైలైట్ చేస్తూ, కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ పేరు తన చేతి పై పచ్చబొట్టుగా వేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేరళ కేంద్రంగా బయటబడిన బంగారం కుంభకోణంలో స్వప్న సురేష్ ప్రధాన నిందితుల్లో ఒకరుగా కేరళ క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ పేరు తన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్న కేరళ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన స్వప్న సురేష్.

ఫాక్ట్ (నిజం): కేరళ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన స్వప్న సురేష్ చేతి పై వేసుకున్న ఆ పచ్చబొట్టు మీద ఉన్నది కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ పేరు కాదు. పోస్టులో షేర్ చేసిన ఆ ఫోటో ఎడిట్ చేయబడినది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ నిందితురాలు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పేర్కొంది.

పోస్టులో లో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘Times Now’ ఛానల్ వారు రాసిన ఒక ఆర్టికల్ లో ఈ ఫోటో దొరికింది. ఆర్టికల్ లో పబ్లిష్ చేసిన ఆ ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే స్వప్న సురేష్ చేతి పై ఉన్న ఆ పేరు కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ ది కాదు అని తెలిసింది. పోస్టులో షేర్ చేస్తున్న ఆ ఫోటో ఎడిట్ చేయబడినది. ఆర్టికల్ లోని అదే ఫోటోని స్పష్టంగా మనం ఇక్కడ చూడవచ్చు. స్వప్న సురేష్ చేతిపై ఉన్న ఆ పేరు ఎవరిదీ అని స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ పేరు కేరళ ముఖ్యమంత్రి పనిరయి విజయన్ ది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపించి కేరళ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన స్వప్న సురేష్ తన చేతిపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పేరు పచ్చబొట్టుగా వేసుకునట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll