National Aeronautics and Space Administration (నాసా)లో ఉద్యోగాలకు సంస్కృత భాషను తప్పనిసరి చేశారంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: నాసాలో ఉద్యోగాలకు సంస్కృత భాషని తప్పనిసరి చేశారు.
ఫాక్ట్: నాసా అటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ విషయంపై ఇంటర్నెట్లో వెతకగా నాసా అధికారిక వెబ్ సైట్లో కానీ, మీడియాలో కానీ, ఎక్కడా కూడా నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు లభించలేదు. ఇక నాసాలో ఉద్యోగాలకు సంబంధించిన వివిధ ప్రకటనలను పరిశీలించగా, వాటిలో ఎక్కడా కూడా సంస్కృతం గురించి కానీ దానిని తప్పనిసరి చేస్తున్నట్లు కానీ పేర్కొనలేదు.
చివరిగా, నాసాలో ఉద్యోగాలకు సంస్కృత భాషని తప్పనిసరి చేసిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.