Fake News, Telugu
 

ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌‌ జిల్లాలో ఇద్దరు సాధువులను చంపిన నిందితుడి పేరు ‘మురారీ’ అలియాస్ ‘రాజు’; ‘అన్సారీ’ కాదు

0

ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌‌ జిల్లాలో ఇద్దరు సాధువులను చంపిన నిందితుడి పేరు అన్సారీ అని చెప్తూ, కొన్ని ఫోటోలు మరియు వీడియోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. సాధువులను చంపిన వ్యక్తి ఒక ముస్లిం అని చాలా మంది పోస్ట్ కింద కామెంట్స్ కూడా పెట్టినట్టు చూడవొచ్చు  ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌‌ జిల్లాలో ఇద్దరు సాధువులను చంపిన నిందితుడి పేరు అన్సారీ.

ఫాక్ట్ (నిజం): బులంద్‌షహర్‌‌ జిల్లాలో ఇద్దరు సాధువులను చంపిన నిందితుడి పేరు అన్సారీ కాదు. అతడి పేరు మురారీ అలియాస్ రాజు. అదే విషయాన్ని చెప్తూ, పోలీసు వారు ఒక వీడియో ని కూడా ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పిందితప్పు.

పోస్ట్ లో చెప్పిన ఘటన గురించి వెతకగా, ఆ ఘటన పై బులంద్‌షహర్‌‌ పోలీసు వారు ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ కేసు గురించి మాట్లాడుతూ, నిందితుడి పేరు ‘మురారీ అలియాస్ రాజు’ అని పోలీసు వారు ట్వీట్ చేసినట్టు చూడవొచ్చు. అదే విషయాన్ని చెప్తూ, పోలీసు వారు ఒక వీడియో ని కూడా ట్వీట్ చేసారు.

ఆ ఘటన పై రిజిస్టర్ చేసిన FIR లో కూడా నిందితుడి పేరు మురారీ అని ఉన్నట్టు చూడవొచ్చు.

చివరగా, ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌‌ జిల్లలో ఇద్దరు సాధువులను చంపిన నిందితుడి పేరు ‘మురారీ’ అలియాస్ ‘రాజు’; ‘అన్సారీ’ కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll