Fake News, Telugu
 

ఈ వీడియోలో కర్రసాము ప్రదర్శిస్తున్న చిన్న పిల్లవాడు నారా దేవాన్ష్ కాదు

0

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ అంటూ ఓ చిన్న పిల్లాడు కర్రసాము చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క వాస్తవికతను చూద్దాం.

క్లెయిమ్: నారా దేవాన్ష్ కర్రసాము ప్రదర్శిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో యొక్క అసలు వర్షన్, ఆకర్ష్ అనే మార్షల్ ఆర్ట్స్ ఆధారిత యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోలో కనిపించిన అబ్బాయి దేవాన్ష్ కాదు; అతని పేరు ఆరవ్. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ యొక్క ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయడానికి, మేము ఇంటర్నెట్‌లో సంబంధిత కీవర్డ్ ఉపయోగించి వెతికాము. ఈ సెర్చ్ వల్ల, వైరల్ వీడియో యొక్క అసలు వర్షన్ దొరికింది.

ఈ వీడియో మే 2023లో ఆకర్ష్ అనే ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ చానెల్‌లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వీడియోలను అప్‌లోడ్ చేస్తారు, ప్రధానంగా సిలంబం (తమిళంలో కర్రసాము.) అనే మార్షల్ ఆర్ట్‌కు చెందిన వీడియోలు ఎక్కవగా అప్లోడ్ చేస్తారు. ఈ వీడియో ప్రకారం, కర్రసాము ప్రదర్శిస్తున్న బాలుడి వయస్సు ఐదు సంవత్సరాలు. ఇదే అబ్బాయి ఈ ఛానెల్ యొక్క వేరే వీడియోల్లో కూడా కనిపించాడు, అందులో అతని పేరు ఆరవ్ అని చెప్పారు.

కింది కోల్లెజ్  ద్వారా ఆరవ్ మరియు నారా దేవాన్ష్ మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించవచ్చు.

చివరిగా, ఈ వీడియోలో కర్రసాము ప్రదర్శిస్తున్న చిన్న పిల్లవాడు నారా దేవాన్ష్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll