Fake News, Telugu
 

అయోధ్య రామ మందిరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ నానా పాటేకర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు

0

కాంగ్రెస్ వాళ్లెవరైనా తమకు ఓటు వేయమని మీ వద్దకు వస్తే, రామమందిరానికి వ్యతిరేకంగా 24 మంది లాయర్లను ఎందుకు పెట్టారని అడగండి”, అని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ వ్యాఖ్యలు చేసారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్య రామ మందిరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తు నానా పాటేకర్ చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్ (నిజం): బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ అటువంటి వ్యాఖ్యలేవి చేయలేదు. 2018లో నానా పాటేకర్ ఒక సందర్భంలో రామ మందిరం నిర్మాణం కన్నా దేశంలో ప్రతి పేదవాడికి తిండి అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని తన అభిప్రాయాన్ని తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టలో చేస్తున్న క్లెయింకు సంబంధించి కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ నానా పాటేకర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. అయోధ్య రామ మందిరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ నానా పటేకర్ తన అధికార సోషల్ మీడియా పేజీలలో ఎటువంటి ట్వీట్ లేదా ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టలేదు. ఒకవేళ నానా పటేకర్ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఇటీవల అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ సమాచారాన్ని తెలుపుతూ ఏ ఒక్క వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు.  

2018లో నానా పాటేకర్ ఒక కార్యక్రమంలో రామ మందిరం నిర్మాణం కన్నా దేశంలో ప్రతి పేదవాడికి తిండి అందించడం ప్రాధాన్యత చూపించాలని తన అభిప్రాయాన్ని తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ముఖ్యపాత్ర పోషించిందని నానా పటేకర్ మరో సందర్భంలో వ్యాఖ్యలు చేశారు.

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుకి సంబంధించి ముస్లింల తరపున వాదించిన జఫర్యాబ్ జిలానీ, రాజీవ ధావన్ మొదలగు లాయర్లను కాంగ్రెస్ పార్టీ నియమించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసుని 45 సంవత్సారలుగా వాధిస్తూ వచ్చిన జఫర్యాబ్ జిలానీకి సమాజ్‌వాధి, AIMIM, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ పలు సార్లు జఫర్యాబ్ జిలానీకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, బాబ్రీ అంశంపై పార్లమెంట్‌లో ఆయన పార్టీ పరిధి దాటి వెళ్లకూడదని కాంగ్రెస్ పెట్టిన షరతు నచ్చక ఆ పార్టీలో కలవలేదని జఫర్యాబ్ జిలానీ సోదరాడు మీడియాకి తెలిపారు.

అయోధ్య రామ మందిరం కేసు హియరింగ్‌ను 2019 సార్వత్రిక ఎన్నికల పూర్తి అయ్యే వరకు వాయిదా వెయ్యాలని మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ 2018లో సుప్రీంకోర్టులో టైటిల్ సూట్ ఫైల్ చేశారు. అయితే, కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు చేసిన ఈ సిఫార్సుకు సున్నీ వక్ఫ్ బోర్డు మరియు కాంగ్రెస్ పార్టీ తమ సంఘీభావం తెలుపలేదని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కపిల్ సిబాల్ 2022లో కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చారు.

నానా పాటేకర్‌కు సంబంధించి ఇదివరకు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేక్ పోస్టులకి సంబంధించి ఫాక్ట్‌లీ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, అయోధ్య రామ మందిరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ నానా పాటేకర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll