Fake News, Telugu
 

ఎడిట్ చేసిన చలనచిత్ర దృశ్యాలని వీర్ సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటి దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

వీర్ సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు బ్రిటిష్ కరెస్పాండంట్ చిత్రీకరించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ వీడియోని ‘BBC’ న్యూస్ సంస్థ ఇటీవల రిలీజ్ చేసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీర్ సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు బ్రిటిష్ కరెస్పాండంట్ చిత్రీకరించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నిజమైన వీర్ సావర్కర్ కాదు. 1983లో వీర్ సావర్కర్ జీవితం పై దర్శకుడు ప్రేమ్ వైద్య రూపొందించిన పలు చిత్రాలలోని దృశ్యాలను జతచేసి ఈ వీడియోని రూపొందించారు. ఈ చిత్రాలు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ వెబ్సైటులోని ఫిలిమ్స్ డివిజన్‌ సెక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో గుగూల్‌లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ 14 ఆగష్టు 2014 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని “Life of Shri Vinayak Damodar Savarkar” అనే టిటిల్‌తో యూట్యుబ్‌లో పబ్లిష్ చేసారు. వీర్ సావర్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలని చూపిస్తూ ఈ చలనచిత్రాన్ని రూపొందించినట్టు వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోలోని 25:08, 27:29 మరియు 29:45 నిమిషాల దగ్గర పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలు కనిపిస్తుండటాన్ని మనం గమనించవచ్చు.

మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ పబ్లిష్ చేసిన ఈ వీడియోలోని 1:25 నిమిషాల దగ్గర, ఈ చలనచిత్రాన్ని ‘Films Division’కు క్రెడిట్ ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియో కోసం ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ వెబ్సైటులోని ‘Films Division’ సెక్షన్‌లో వెతకగా, 1983లో వీర్ సావర్కర్ జీవితం పై దర్శకుడు ప్రేమ్ వైద్య రూపొందించిన మూడు చలనచిత్ర వీడియోలు దొరికాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోని బ్రిటిష్ కరెస్పాండంట్ చిత్రికరించలేదని, దర్శకుడు ప్రేమ్ వైద్య వీర్ సావర్కర్ జీవితం పై రూపొందించిన పలు చిత్రాలలోనివని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన చలనచిత్ర దృశ్యాలని వీర్ సావర్కర్ అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు చిత్రీకరించిన దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll