Fake News, Telugu
 

ఈ వీడియో శివుడికి సంబంధించినది కాదు; ఫౌంటైన్‌లో ఎక్కడా కూడా శివుడికి సంబంధించిన దృశ్యాలు రాలేదు

0

ఒక హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌ వీడియోని పోస్ట్ చేసి, అది శివుడికి సంబంధించినట్టు చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. “ఓం నమః శివాయ” అంటూ ఆడియో పెట్టడమే కాకుండా పోస్ట్ కింద వందల మంది కామెంట్ కూడా చేసారు. పోస్ట్‌లోని వీడియో శివుడికి సంబంధించిన వీడియోనేనా కాదా చూద్దాం.

క్లెయిమ్: శివుడికి సంబంధించిన హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌ వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో శివుడికి సంబంధించినది కాదు. వీడియోలో కనిపిస్తున్న హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌లో ఎక్కడా కూడా శివుడికి సంబంధించిన దృశ్యాలు రాలేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వస్తాయి. ఆ వీడియోని చైనాలో తీసారని చాలా మంది పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. శివుడికి సంబంధించి ఏదీ కూడా వీడియోలో కనిపించలేదు. అంతేకాదు, వేరే వీడియోల్లో “ఓం నమః శివాయ” అంటూ ఆడియో కూడా లేదు. సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చిన ఎక్కువ నిడివి ఉన్న వీడియోని గమనించగా, వీడియో చివర్లో శాంటాక్లజ్‌ కూడా వచ్చినట్టు గమనించవొచ్చు. అయితే, వీడియోని చైనాలో తీసినట్టు చెప్పడానికి కచ్చితమైన సమాచారం ఏమీ లభించలేదు.

వీడియోలోని హోలోగ్రాఫిక్‌ వాటర్ ఫౌంటైన్‌లో కనిపిస్తున్న దృశ్యాలకు సంబంధించిన మరో వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఈ వీడియోలో అన్ని దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎక్కడా కూడా శివుడికి సంబంధించిన దృశ్యాలు లేవు. 

చివరగా, పోస్ట్‌లోని వీడియో శివుడికి సంబంధించినది కాదు; ఫౌంటైన్‌లో ఎక్కడా కూడా శివుడికి సంబంధించిన దృశ్యాలు రాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll