English, Fake News
 

2011 నాటి వై ఎస్ జగన్ ఫోటో ని ఎడిట్ చేసి మద్యం బాటిల్ తో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్పే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నే మద్యపాన బాటిల్ల తో కూర్చున్నట్టు చూపెడుతూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫోటోలో మందు బాటిల్లతో జగన్ మోహన్ రెడ్డి.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోని 2011 లో జగన్ అక్బరుద్దీన్ ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తీసినది. ఒరిజినల్ ఫోటోలో మందు బాటిల్ ఉండదు. ఎడిట్ చేసి పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో ఒరిజినల్ ఫోటో వస్తుంది. ఆ ఫోటోకి సంబంధించిన వీడియో కూడా సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. అది 2011లో జగన్ అక్బరుద్దీన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. ఆ ఫోటో లో మందు బాటిల్ ఉండదు. పోస్ట్ లోని ఫోటోలో మందు బాటిల్ ని ఎడిట్ చేసి పెట్టారు.

చివరగా, 2011లో జగన్ అక్బరుద్దీన్ ని పరామర్శించటానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలో మందు బాటిల్ ని ఎడిట్ చేసి పెట్టారు.

Share.

About Author

Comments are closed.

scroll