Fake News, Telugu
 

మార్ఫ్ చేసిన ఫోటోని ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం వేషాధారణ దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు

0

ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం వేషాధారణ దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం వేషాధారణ ఫోటో

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో ఉన్నది ఎమిరేట్ ఆఫ్ బుఖారా అంతర్గత మంత్రి కుష్-బెగ్గి, ప్రధాని నరేంద్ర మోదీ కాదు. ఈ ఫోటోని రష్యా కెమిస్ట్ మరియు కలర్ ఫోటోగ్రాఫి నిపుణుడు సెర్గీ మిఖైలోవిచ్ ప్రోకుడిన్-గోర్స్కీ 1911లో తీసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, పోస్టులో షేర్ చేసిన అదే ఫోటోతో పోలి ఉన్న మరొక ఫోటో మాకు ‘posterazzi’ వెబ్సైటులో దొరికింది. కాని, ఒరిజినల్ ఫోటోలో ఉన్నది భారత ప్రధాని నరేంద్ర మోదీ కాదు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎమిరేట్ ఆఫ్ బుఖారా (ఉజ్బెకిస్తాన్ మాంగిట్ రాజవంశంలోని చివరి ఎమిరేట్) అంతర్గత వ్యవహారాల మంత్రి కుష్-బెగ్గి అని ఈ వెబ్సైటులో తెలిపారు. ‘Getty Images’ వెబ్సైటుతో సహా మరికొన్ని వెబ్సైట్లులలో కూడా ఈ ఫోటోని ఇదే వివరణతో పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ ఫోటోని రష్యా ఫోటోగ్రాఫర్ సెర్గీ మిఖైలోవిచ్ ప్రోకుడిన్-గోర్స్కీ 1911లో తీసినట్టు ఈ వెబ్సైటులలో తెలిపారు.

 సెర్గీ మిఖైలోవిచ్ ప్రోకుడిన్-గోర్స్కి, 20వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ కెమిస్ట్ మరియు ఫోటోగ్రాఫర్. సెర్గీ మిఖైలోవిచ్ 1909 నుండి 1915 వరకు రష్యాలోని అనేక ప్రాంతంలోని సందర్శించి తన త్రీ-ఇమేజ్ కలర్ ఫోటోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి అనేక ఫోటోలని తీసి రికార్డు చేసినట్టు తెలిసింది. సెర్గీ మిఖైలోవిచ్ కలెక్షన్లలోని చాలా వరకు ఫోటోలు ఇప్పుడు ‘యూ. ఎస్. లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్’ లో పొందు పరిచి ఉన్నాయి. డిజిటల్ కలర్ రెండరింగ్ చేసి పబ్లిష్ చేసిన కుష్-బెగ్గి ఫోటో మాకు ‘యూ.ఎస్. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ వెబ్సైటులో లభించింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని నరేంద్ర మోదీ ముస్లిం వేషాధారణ ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll