Fake News, Telugu
 

‘షహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనడానికి రోజుకి 500 రూపాయలు’ అనే ఫ్లెక్సీతో మహిళలు ఉన్న ఇమేజ్ ఫోటోషాప్ చేసినది

0

‘షహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనడానికి రోజుకి 500 రూపాయలు’ అనే ఫ్లెక్సీతో కొంతమంది మహిళలు ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘నిరసనల్లో పాల్గొనడానికి రోజుకి 500 రూపాయలు’ అని రాసున్న ఫ్లెక్సీ దగ్గర నిల్చొని ఉన్న షహీన్ బాగ్ వాసులు. 

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఇమేజ్ ఫోటోషాప్ చేసినది. వాస్తవ ఇమేజ్ లో ఫ్లెక్సీ మీద ‘CAA ని వాపస్ తీస్కోండి, NRC ని వాపస్ తీస్కోండి’ అని హిందీలో రాసి ఉంటుంది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అలాంటి ఫోటోనే ఉన్న ‘Huffington Post’ వారి ఒక కథనం సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. కానీ, ఆ ఫొటోలో ఉన్న ఫ్లెక్సీ మీద ‘CAA ని వాపస్ తీస్కోండి, NRC ని వాపస్ తీస్కోండి’ అని హిందీలో రాసి ఉంది. ఆ ఫోటోకి క్రెడిట్స్ ‘Getty Images’ అని ఉండడంతో ఆ సంస్థ వెబ్సైటులో వెతికినప్పుడు, ఆ ఫోటో లభించింది. అందులో కూడా ఫ్లెక్సీ మీద ‘CAA ని వాపస్ తీస్కోండి, NRC ని వాపస్ తీస్కోండి’ అనే ఉంది. కావున, పోస్టులోని ఇమేజ్ ఫోటోషాప్ చేసినది.

చివరగా, ‘CAA ని వాపస్ తీస్కోండి, NRC ని వాపస్ తీస్కోండి’ అని ఉన్న ఫోటోని ఫోటోషాప్ చేసి పోస్టులో పెట్టారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll