Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న ఈ బ్యానర్ మార్ఫ్ చేయబడింది

0

పండిన పంట కొననప్పుడు 24 గంటల కరెంటు, లక్ష కోట్ల ప్రాజెక్టులు ఎందుకని ఒక రైతు కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ప్లకార్డ్ పట్టుకొని నిరసన చేస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒక రైతు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డ్ పట్టుకొని నిరసన చేపట్టిన దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి, “ఇది మా తాత గారి జాగిర్. ఇది మా అయ్యసొమ్ము. ఇది మా అమ్మ గారిల్లు. ఇది నా ఇలాక…”, అని రాసి ఉన్న ప్లకార్డుని పట్టుకున్నారు. ఈ ఫోటోని 2012లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తీసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని 2012 ఆగష్టు నెలలో తెలంగాణ ధూం ధాం అనే ఫేస్‌బుక్ పేజీ షేర్ చేసినట్టు తెలిసింది. తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల లెక్కలని చూపుతూ, తెలంగాణ నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయానికి నిరసన వ్యక్త పరుస్తూ ఈ ఫోటోని షేర్ చేసారు. ఈ ఒరిజినల్ ఫోటోలో కనిపిస్తున్న ప్లకార్డుపై, “ఇది మా తాత గారి జాగిరి. ఇది మా అయ్య సొమ్ము. ఇది మా అమ్మ గారిల్లు. ఇది నా ఇలాక…”, అని రాసి ఉంది. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ ఇటీవల తెలంగాణ రైతులు పలు చోట్ల నిరసన కార్యకమాలు చేపట్టారు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది.

చివరిగా, తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యమంటూ షేర్ చేస్తున్న మార్ఫ్ ఫోటో చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll