Fake News, Telugu
 

ఒక 50 సంవత్సరాల వ్యక్తి తన 24 ఏళ్ల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని తెలుగు డిజిటల్ మీడియా సంస్థలు షేర్ చేస్తున్నాయి

0

ఒక అనూహ్యమైన పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక 50 ఏళ్ల వ్యక్తి తన 24 సంవత్సరాల కూతురిని పెళ్లి చేసుకున్నాడు అని ఒక మధ్య వయస్కుడు, ఒక యువతి పూల మాలలు వేసుకుని కెమెరా వెనుక ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తెలుగు డిజిటల్ మీడియా సంస్థలు అయిన దిశ టీవీ, Idream మీడియా మరియు Suman టీవీ వంటి సంస్థలు ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూన్నారు.  Suman టీవీ మరియు Idream మీడియా వాళ్లు ఈ సంఘటన నిజంగా జరిగింది అని చెప్తుంటే దిశ టీవీ వాళ్లు మాత్రం ఇది నిజమో కాదో తెలియదు కానీ కొన్ని వెబ్సైట్లలో దీనిపై ఆర్టికల్స్ వచ్చాయి అని చెప్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్ లింక్స్ మీకు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ దొరుకుతాయి. 

క్లెయిమ్: ఒక 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి తన సొంత 24 ఏళ్ల కూతురిని పెళ్లి చేసుకున్న సంఘటనని ఈ వీడియో చూపిస్తుంది.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను అంకిత కరోటియా అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. కావున, వైరల్ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్‌ను వెరిఫై చేయడానికి అందులోని కొన్ని కీ  ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేయగా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ (అర్చైవ్ లింక్) మాకు దొరికింది. దీన్ని ‘Royal Tiger’ అనే యూట్యూబ్ ఛానల్ వారు 2 నవంబర్ 2024న అప్లోడ్ చేశారు. ఇది ఒక వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్.


ఈ వీడియోలో 0:47 టైమ్-స్టాంప్ దగ్గర ఒక వివరణ ఉంది. ఇందులో, ఈ వీడియోని వీళ్లు కేవలం వినోదం కోసం తయారు చేశారు అని చెప్పారు. అంటే ఈ వీడియోలో కనిపిస్తున్న సంఘటన నిజంగా జరగలేదు, ఇదంతా కేవలం యాక్టింగ్. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి మాట్లాడుతూ, తను తన మామను పెళ్లి చేసుకుంది అని చెప్తుంది.

అలాగే, ఈ వివరణ కింద, ‘Ankita Karotiya’ అనే పేరు ఉంది. ఈ పేరు గురించి ఇంటర్నెట్లో వెతుకగా, అంకితా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాకు దొరికింది. తన పేజీ యొక్క బయోలో, తను ఒక వీడియో క్రియేటర్ అని అలాగే ఢిల్లీకి చెంది ఒక ప్రాంక్‌స్టర్ అని రాసి ఉంది.  

అదనంగా, తన యూట్యూబ్ ఛానల్‌లో అంకితా చాలా స్క్రిప్టెడ్ వీడియోలను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి అంకితా అప్లోడ్ చేసిన వేరే వీడియోలో వేరే పాత్రలు పోషించాడు. ఆ వీడియోలని మీరు ఇక్కడ  మరియు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ఛానల్‌లో ఉన్న చాలా వీడియోలలో నటీనటులు రిపీట్ అవ్వడం కూడా మీరు గమనించవచ్చు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ)

చివరిగా, ఒక 50 ఏళ్ల వ్యక్తి తన 24 ఏళ్ల కూతురిని పెళ్లి చేసుకున్న నిజమైన సంఘటనను ఈ వీడియో చూపిస్తుంది అని ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll