‘హౌజపూర్ జైలు సంఘటనలో అనుమానాస్పద కరోనా రోగి కనుగొనబడింది.ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న పోలీసులుకు ఆ భగవంతుడు వాళ్ళ ప్రాణాలు రక్షించుగాక’ అని చెప్తూ, ఫేస్బుక్ లో ఒక వీడియో ని చాలా మంది పోస్టు చేస్తున్నారు. ఆ పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హాజీపూర్ జైలులో అనుమానాస్పద కొరోనా వైరస్ రోగిని కనుగొన్న వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్నది ఒక మాక్ డ్రిల్. దాన్ని హాజీపూర్ (బీహార్) పోలీసు బృందం మరియు వైద్య సిబ్బంది కలిసి నిర్వహించారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో ఉన్న విషయం ఆధారంగా గూగుల్ లో ‘Hajipur jail coronavirus’ అని వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ వీడియో హాజీపూర్ లోని వైశాలి జైలు లో నిర్వహించిన మాక్ డ్రిల్ ది అంటూ అనేక యూట్యూబ్ న్యూస్ చానెల్స్ పేర్కొన్నాయి. ఆ రిజల్ట్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వాటి ద్వారా, ఆ మాక్ డ్రిల్ ని హాజీపూర్ (బీహార్) పోలీసు బృందం మరియు వైద్య సిబ్బంది వైశాలి జిల్లా లో కొరోనావైరస్ అనుమానితులతో వ్యవహరించాల్సిన పద్ధతి గురించి అవగాహన కల్పించడం కోసం చేపట్టినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, బూమ్ వార్తాసంస్థ వారు పోలీసు వారితో మాట్లాడగా, వారు కూడా అది ఒక మాక్ డ్రిల్ వీడియో అని తెలిపారు. కావున, వీడియో వాస్తవ ఘటనది కాదు.
చివరగా, పోస్టులో పెట్టిన వీడియో హాజీపూర్ (బీహార్) పోలీసు బృందం మరియు వైద్య సిబ్బంది కలిసి చేపట్టిన ‘మాక్ డ్రిల్’ ది.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?