ఇటీవల దేశవ్యాప్తంగా సిటిజెన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ కి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండడం, పోలీసులు నిరసనకారుల పై దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ దాడులను సమర్థిస్తూ, పోలీసులు కొంతమంది నిరసనకారుల మీద కాల్పులు జరుపుతున్నారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో ఫేస్బుక్ లో షేర్ చేయబడుతుంది. ఆ వీడియో లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: నిరసనకారుల మీద పోలీసులు కాల్పులు జరుపుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలో పోలీసులు నిజంగా కాల్పులు జరపటం లేదు, అది ఝార్ఖండ్ రాష్ట్రంలో పోలీసులు జరుపుతున్న ఒక మాక్ డ్రిల్ కి సంబంధించిన వీడియో. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
ఇదే వీడియోని ఇంతకముందు కూడా తమంది జమ్మూ&కాశ్మీర్ పోలీసులు ముస్లింలపై కాల్పులు జరుపుతున్న వీడియో అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు, అది తప్పు అని ‘Factly’ రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఆ ఆర్టికల్ ద్వారా పోస్ట్ లోని వీడియో ఝార్ఖండ్ రాష్ట్రం లో పోలీసులు చేసిన మాక్ డ్రిల్ కి సంబంధించినది అని తెలుస్తుంది. అంతేకాక, ఆ వీడియో లో చుట్టుపక్కల ఉన్న భవనాల ఫోటోలను గూగుల్ మాప్స్ లో ఉన్న భవనాల ఫోటోల తో పోల్చి చూడగా, ఆ మాక్ డ్రిల్ ఝార్కండ్ లోనే జరిగింది అని అర్థం అవుతుంది.
చివరగా, పోస్టులో చెప్పినట్టు ఆ వీడియోలో పోలీసులు నిజంగా కాల్పులు జరపలేదు, అది ఝార్ఖండ్ లో పోలీసులు చేసిన ఒక మాక్ డ్రిల్ కి సంబంధించిన వీడియో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?