Fake News, Telugu
 

బీహార్ పాఠశాలలో తీసిన మధ్యాహ్న భోజన పథకం ఫోటోని ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధులకి జగన్ ప్రభుత్వం పౌష్టిక మధ్యాహ్న భోజనం అందిస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకి వై.యస్. జగన్ ప్రభుత్వం పౌష్టిక మధ్యాహ్న భోజనం అందిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో, బీహార్ రాష్ట్రంలోని చుర్చూరియా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు తీసినది. ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Samridh Jharkhand’ న్యూస్ వెబ్ సైట్ 13 ఏప్రిల్ 2019 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లాలోని చుర్చూరియా ప్రాథమిక పాఠశాలకి సంబంధించిందని ఆర్టికల్ లో తెలిపారు. చుర్చూరియా ప్రాథమిక పాఠశాల యాజమాన్యం తమ విద్యార్ధులకి పౌష్టిక ఆహరం అందిస్తున్నట్టు ఈ ఆర్టికల్ లో వివరించారు. ఏప్రిల్ 2019లో అంటే, అప్పటికి వై.యస్. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చెయ్యలేదు.

ఈ వివరాల ఆధారంగా గూగుల్ లో వెతికితే, చుర్చూరియా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకి అందిస్తున్న నాణ్యమైన మధ్యాహ్న భోజనం గురించి ‘The Hindustan Times’ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసిన ఫోటోలో కూడా పోస్టులోని ఫోటోలో కనిపిస్తున్న పరిసరాలని మనం  చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, ఈ ఫోటోని ఇదే క్లెయిమ్ తో గతంలో షేర్ చేసినప్పుడు, FACTLY దీనికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, బీహార్ ప్రాథమిక పాఠశాలలో తీసిన ఫోటోని చూపిస్తూ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్ధులకి అందిస్తిస్తున్న పోష్టిక మధ్యాహ్న భోజనం అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll