Fake News, Telugu
 

పోస్టులోని ఫోటో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలది

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది జగన్ పరిపాలనలో ఆంధ్ర ప్రదేశ్ లోని పాఠశాలలో పిల్లలు పౌష్టిక మధ్యాహ్న భోజనం తింటున్నదని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్ లోని పాఠశాలలో పిల్లలు పౌష్టిక మధ్యాహ్న భోజనం తింటున్న ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ఫోటో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లాలోని చుర్చూరియా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నప్పటిది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

పోస్టులోని ఫోటోని క్రాప్ చేసి వెతికినప్పుడు, అదే ఫోటో ‘Samridh Jharkhand’ అనే న్యూస్ వెబ్సైటు ఏప్రిల్-2019 లో ప్రచురించిన ఒక కథనం లో లభించింది. ఏప్రిల్ -2019 అంటే అప్పటికి ఇంకా జగన్ ముఖ్యమంత్రి అవ్వలేదు. అంతేకాదు, ఆ ఫోటో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లాలోని చుర్చూరియా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఫోటో అని ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది

పైన లభించిన సమాచారంతో గూగుల్ లో వెతికినప్పుడు, ‘The Hindustan Times’ వారు చుర్చూరియా ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన మధ్యాహ్న భోజనం గురించి రాసిన కథనం లభించింది. ఆ కథనం లో ఉన్న ఫొటోలో కూడా పోస్టులోని ఫొటోలో ఉన్న పరిసరాలను చూడవచ్చు.

ఇంతకుముందు పోస్టులోని ఫోటోనే ఢిల్లీ లోని పాఠశాలలోనిదని సోషల్ మీడియాలో చలామణీ అయింది. అప్పుడు  ‘Aaj Tak’ వారు చుర్చూరియా ప్రాథమిక పాఠశాల యాజమాన్యాన్ని ఆ ఫోటో గురించి సమాచారం కోసం సంప్రదించగా, అది తమ పాఠశాలలోనిదే అని వారు తెలిపారు.

చివరగా, పోస్టులోని ఫోటో బీహార్ రాష్ట్రం అరారియా జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలోనిది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll