Fake News, Telugu
 

సీఎంఐఈ (CMIE) నివేదిక ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017లో 17.5% నిరుద్యోగ రేటు ఉండేదని తప్పుదోవ పట్టిస్తున్నారు

0

సీఎంఐఈ (CMIE) నివేదిక ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017లో 17.5% నిరుద్యోగిత రేటు ఉంటే, 2021లో 4.2%కి తగ్గినట్టు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక స్వతంత్ర ప్రభుత్వేతర సంస్థ. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సీఎంఐఈ (CMIE) నివేదిక ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017లో 17.5% నిరుద్యోగిత రేటు ఉంటే, 2021లో 4.2%కి తగ్గింది.

ఫాక్ట్ (నిజం): సీఎంఐఈ నెలవారీ నివేదిక ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎర్పడ్డ సమయానికి (మార్చ్ 2017 చివర్లో) నిరుద్యోగిత రేటు 5% (సీఎంఐఈ ఏప్రిల్ 2017 డేటా); 17.5% కాదు. ఆగష్టు 2016లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 17.1% నిరుద్యోగిత రేటు ఉన్నది; పోస్టులో చెప్పినట్టు 2017లో ఈ ఫిగర్ లేనేలేదు. అక్టోబర్ 2021లో అయితే మాత్రం పోస్టులో చెప్పిన విధంగా 4.2%గా ఉంది. ఒకానోకసారి కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్ 2020లో, ఉత్తర్‌ప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 21.5%కి పెరిగింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక స్వతంత్ర ప్రభుత్వేతర సంస్థ. సీఎంఐఈ, దేశంలో నిరుద్యోగిత రేటుకి సంబంధించి అన్నీ రాష్ట్రాల నెలవారీ (monthly) డేటాను తమ వెబ్సైటులో షేర్ చేస్తుంది. ఈ సీఎంఐఈ నెలవారీ నివేదిక ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎర్పడ్డ సమయానికి (మార్చ్ 2017 చివర్లో) నిరుద్యోగిత రేటు 5% (సీఎంఐఈ ఏప్రిల్ 2017 డేటా); 17.5% కాదు. ఆగష్టు 2016లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 17.1% నిరుద్యోగిత రేటు ఉన్నది; పోస్టులో చెప్పినట్టు 2017లో ఈ ఫిగర్ లేనేలేదు. అక్టోబర్ 2021లో అయితే మాత్రం పోస్టులో చెప్పిన విధంగా 4.2%గా ఉంది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్ 2020లో, ఉత్తర్‌ప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 21.5%కి పెరిగింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 2021లో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 2016లో 17 శాతానికి పైగా ఉందని, అది ఇప్పుడు 4-5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 2017లో 17 శాతం ఉన్నట్టు ఆయన అనలేదు.

చివరగా, సీఎంఐఈ (CMIE) నివేదిక ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017లో 17.5% నిరుద్యోగిత రేటు ఉండేదని తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll