‘ఒలింపిక్స్ విజయం తర్వాత పీవీ సింధు, తల్లితో కలసి ఆలయ సందర్శన’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఒలింపిక్స్ విజయం తర్వాత పీవీ సింధు తన తల్లితో కలసి ఆలయం సందర్శించినట్టు వీడియోలో చూడవొచ్చు.
ఫాక్ట్: కేరళలోని ఆలయాలను పీవీ సింధు 2019లో సందర్శించినప్పుడు తీసిన వీడియో అది. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో సింధు మెడల్ గెలిచిన తరువాత తీసినది కాదు. అంతేకాదు, ఇంతకముందు ఒలింపిక్స్‌లో సింధు మెడల్ గెలిచింది 2016లో; కానీ వీడియో 2019కి సంబంధించింది. కావున, పాత వీడియోని సింధు యొక్క తాజా ఒలింపిక్స్ విజయం తర్వాత తీసిన వీడియోగా షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్‌లోని వీడియో గురించి కొన్ని కీ-వర్డ్స్ సహాయంతో ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి వీడియోలు కొన్ని సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ‘P V Sindhu Visits Attukal Temple’ (పీవీ సింధు అట్టుకల్ ఆలయాన్ని సందర్శించింది) అనే టైటిల్‌తో ‘కేరళ ఒలింపిక్’ యూట్యూబ్ ఛానల్ వారు 2019లో పోస్ట్ చేసిన వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోలోని విజువల్స్ పోస్ట్‌లోని వీడియోతో పోలి ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, వారు వేసుకున్న దుస్తులు ఒకటేలా ఉన్నట్టు గమనించవొచ్చు.
అక్టోబర్ 2019లో శ్రీ పద్మనాభస్వామి, అట్టుకల్ భగవతి ఆలయాలను పీవీ సింధు సందర్శించినట్టు చెప్తూ, అప్పట్లో వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్‌లోనిది తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో సింధు మెడల్ గెలిచిన తరువాత తీసిన వీడియో కాదు. అంతేకాదు, ఇంతకముందు ఒలింపిక్స్‌లో సింధు మెడల్ గెలిచింది 2016లో; కానీ వీడియో 2019కి సంబంధించింది.
అయితే, తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన తరువాత పీవీ సింధు విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లినట్టు తెలిసింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, పోస్ట్‌లోని ఆలయ సందర్శన వీడియో తీసినది 2019లో; తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు మెడల్ గెలిచిన తరువాత కాదు.