Fake News, Telugu
 

స్విస్ బ్యాంకుల్లో ‘నల్ల ధనం’ దాచుకున్న ఈ భారతీయుల లిస్ట్ అంటూ షేర్ చేస్తున్నది ఫేక్

0

స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల మొదటి లిస్టు రిలీజ్ చేసిన వికీలీక్స్ అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఆ లిస్టులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, శరద్ పవార్, జయలలిత పేర్లు ఉన్నాయని పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న ప్రతిపక్ష నాయకులు లిస్టు రిలీజ్ చేసిన వికీలీక్స్.

ఫాక్ట్: వికీలీక్స్ ఏనాడూ స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల లిస్టు పబ్లిష్ చేయలేదు. వికీలీక్స్ 2011లోనే ట్వీట్ చేసి ఇలా షేర్ అవుతున్న లిస్టుల గురించి వివరణ ఇస్తూ ఇటువంటిది పబ్లిష్ చేయలేదని తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.           

స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల మొదటి లిస్టు రిలీజ్ చేసిన వికీలీక్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు 2011 నుండి షేర్ అవుతున్నాయి. అటువంటి ఒక లిస్టులో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నట్టు 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

పోస్టులో చెప్పిన విషయం గురించి wikileaks.org వెబ్సైటులో వెతకగా స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల మొదటి లిస్టు అని సమాచారం లభించలేదు. 2011లో వికీలీక్స్ ఫౌండర్ అయిన జూలియన్ అసాంజ్ స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ వరకు నల్ల ధనం భారతదేశం నుండే వస్తుందని అన్నాడు. వారు త్వరలో పబ్లిష్ చేయబోయే లిస్టులో భారతీయుల పేర్లు కూడా ఉన్నట్టు తెలిపారు, కానీ, పోస్టులో పెట్టిన లిస్ట్ పబ్లిష్ చేసినట్టు ఎటువంటి సమాచారం లభించలేదు.

వికీలీక్స్ ఏనాడూ స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల లిస్టు అంటూ పబ్లిష్ చేయలేదు. వికీలీక్స్ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా 2011లోనే ఇలా షేర్ అవుతున్న లిస్టుల గురించి వివరణ ఇచ్చారు.  

భారత ప్రభుత్వానికి భారతీయుల స్విస్ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాక్ట్ కింద లభిస్తుంది. మూడోవ లిస్టు సెప్టెంబర్ 2021లో వచ్చినట్టు తెలుస్తుంది. స్విట్జర్లాండ్ భారతదేశానికి మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఈ పాక్ట్ కింద డీటెయిల్స్ షేర్ చేస్తుంది. సెప్టెంబర్ 2019లో మొదటి లిస్టు భారత్ కు లభించింది; పూర్తిగా 75 దేశాలకు అప్పట్లో లభించింది. సెప్టెంబర్ 2020లో రెండొవ లిస్టు వచ్చినప్పుడు 86 దేశాలకు ఇచ్చారు. పోస్టులో పెట్టిన విధంగా లిస్టును భారత ప్రభుత్వం షేర్ చేయలేదు.

స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల మొదటి లిస్టు రిలీజ్ చేసిన వికీలీక్స్ అంటూ ఇంతకముందు వైరల్ అయినప్పుడు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న ఈ భారతీయుల లిస్టు వికీలీక్స్ రిలీజ్ చేసిందంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll