ఫేస్బుక్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్న ఒక పాత ఫోటో ని పెట్టి, అందులో ఉన్నది ఒకరు జయలలిత అని, మరొకరు నిర్మలా సీతారామన్ అని దాని గురించి చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: జయలలిత మరియు నిర్మలా సీతారామన్ యొక్క ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో జయలలిత తో పాటు ఉన్నది నిర్మలా సీతారామన్ కాదు. ఆమె తమిళ రచయత్రి శివశంకరి. కావున పోస్టు లో చెప్పింది తప్పు.
పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో మరొక ఫేస్బుక్ పోస్టు లో లభించింది. ఆ ఫోటో లో ఉన్నది జయలలిత మరియు తమిళ రచయత్రి శివశంకరి అని ఆ పోస్టు లో చూడవచ్చు. అదే ఫోటో తమిళ న్యూస్ వెబ్సైటు ‘Vikatan’ జయలలిత మిత్రుల గురించి ప్రచురించిన కథనం లో ఉంది. అందులో శివశంకరి గురించి ప్రస్తావించినట్లుగా చూడవచ్చు. అంతేకాదు, నిర్మలా సీతారామన్ మరియు శివశంకరి కి సంబంధించిన పాత ఫోటోలను మరియు పోస్టు లోని ఫోటోలో కుడి వైపు ఉన్న మహిళ ను పోల్చినప్పుడు, ఆమె తమిళ రచయత్రి శివశంకరి యే అని నిర్ధారణకు రావచ్చు.
చివరిగా, ఫోటోలో జయలలిత తో పాటు ఉన్నది నిర్మలా సీతారామన్ కాదు; ఆమె తమిళ రచయత్రి శివశంకరి.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?