Fake News, Telugu
 

ముస్లింల ఇళ్ళను కాదు, హిందువుల ఇళ్ళను కూల్చినప్పుడు ఈ ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయి

0

కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి గంగా నది వరకు రహదారి వెడల్పు పెంచడానికి, మోడీ జీ రోడ్డు మీద ఉన్న 80 మంది ముస్లింల ఇళ్లను కొనడం ప్రారంభించారు. ఈ ఇళ్ళు కూల్చివేసినప్పుడు, అందులో 45 పాత దేవాలయాలు కనుగొనబడ్డాయి’ అని చెప్తూ, రెండు వీడియోలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు 80 మంది ముస్లింల ఇళ్ళను కూల్చివేసినప్పుడు 45 పాత దేవాలయాలు కనుగొనబడ్డాయి. 

ఫాక్ట్ (నిజం): కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు అసలు ముస్లింల ఇళ్ళు కూల్చలేదు. ఆ ప్రదేశంలో కేవలం హిందువుల ఇళ్ళు ఉన్నాయి. వారి ఇళ్ళు కూల్చినప్పుడు ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారి ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు భవనాలను కూల్చగా, ప్రాచీన దేవాలయాలు కనుగొనినట్లు ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. అయితే పోస్టులో చెప్పినట్టు కూల్చినవి ముస్లింల ఇళ్ళు అని ఎక్కడా కూడా లేదు. పోస్ట్ లో పెట్టిన ఒక వీడియోలో కూడా 38 సెకండ్ల దగ్గర కూల్చినవి హిందూ ఇళ్ళు అని అన్నట్టు వినొచ్చు.

గత సంవత్సరం మే నెలలో ‘సండే గార్డియన్ లైవ్’ వారితో ఆ కారిడార్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న విశాల్ సింగ్ (సీఈఓ – శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్) మాట్లాడుతూ, అక్కడ ఆ కారిడార్ ప్రదేశంలో ఉన్నవారు అందరు హిందువులే అని తెలిపాడు

గత సంవత్సరం కూడా ఇదే క్లెయిమ్ తో వీడియోలు వైరల్ అయినప్పుడు, ‘ఆల్ట్ న్యూస్’ వారితో విశాల సింగ్ మాట్లాడుతూ కూడా ఒక ముస్లిం ఇల్లు కూడా వారు కారిడార్ కోసం కూల్చలేదని తెలిపినట్టు వారి ఆర్టికల్ లో చదవొచ్చు. అంతేకాదు, కారిడార్ కొరకు తీసుకున్న ఇళ్ల వివరాలను ‘Shri Kashi Vishwanath Special Area Development Board’ వారి వెబ్సైటులో చూడవొచ్చు. అందులో కూడా ఎవరు ముస్లింలు లేనట్టు చూడవొచ్చు. ఆ కారిడార్ కి సంబంధించిన మరిన్ని వివరులు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు ముస్లింల ఇళ్ళు కూల్చినప్పుడు ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll