Fake News, Telugu
 

కె.జె. ఏసుదాసు క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మారలేదు

0

Update (23 January 2022):

‘సుప్రసిద్ధ గాయకుడు జేసుదాసు క్రైస్తవం స్వీకరించి యేసుదాసుగా మారిన తరువాత హైందవ ధర్మం విలువ తెలుసుకొని తిరిగి హిందుమతంలోకి చేరి జేసుదాసుగా 83వ పుట్టినరోజు నేడు అయ్యప్ప స్వామి సన్నిధిలో శరణం అయ్యప్ప అని వేడుకున్న అద్భుతమైన ద్రుశ్యం’ అంటూ గాయకుడు కె. జె. ఏసుదాసు పాట పాడుతున్న వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

పోస్టులో ఉన్న వీడియో గురించి మరియు అందులో చెప్తున్నట్లు ఏసుదాసు తన 83వ పుట్టినరోజున మతం మారారా, అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో 2016లో ఏసుదాసు శబరిమల దేవాలయాన్ని దర్శించుకున్నపటిది అని కొన్ని కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ), హరిసరాసనం అనే పాటని ఆయన అక్కడ పాడారు. తను హిందూ మతం స్వీకరించినట్లు ఎక్కడ కూడా ఈ కథనాల్లో ప్రస్తావించలేదు.

ఏసుదాసు పుట్టుకతోనే క్రైస్తవుడు (ఇక్కడ, ఇక్కడ). ఆయన 83వ పుట్టిన రోజు సందర్భంగా హిందూ మతంలోకి ఇటీవల మారినట్లు రుజువు చెయ్యటానికి ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు, తన సతీమణి ప్రభ ఏసుదాసు వాటిని ఖండించారు. కావున, కె జె ఏసుదాసు తన 83వ జన్మదినాన క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మారినట్టు చేస్తున్న క్లెయిమ్ తప్పు.

Published (18 January 2022):

కె.జె. ఏసుదాసు క్రైస్తవ మతం నుండి బయటపడ్డారు అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. క్రైస్తవుడిగా పుట్టడం నా తప్పు కాదు, క్రైస్తవుడిగా చావటం నా తప్పు అని ఆయన అన్నట్లు పోస్టులోని గ్రాఫిక్ పైన రాసి ఉంది. అసలు ఈ పోస్టులో ఉన్న వాస్తవాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

క్లెయిమ్: ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాసు క్రైస్తవ మతం నుండి హిందూ మతానికి మారారు.

ఫ్యాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న ఫోటో కె.జె. ఏసుదాసు 2016లో కేరళలోని శబరిమల దేవాలయాన్ని దర్శించినప్పటిది. కె.జె. ఏసుదాసు ఇటీవల హిందూ మతం  స్వీకరించినట్లు ఎటువంటి వార్త కథనాలు కూడా లేవు. 2016లో కె.జె. ఏసుదాస్ హిందూ మతానికి మారారు అనే పుకార్లు వచ్చినప్పుడు, తన భార్య ప్రభ ఏసుదాసు వాటిని నిరాకరించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా ఈ ఫోటో కలిగి ఉన్న కొన్ని వార్తా కథనాలు లభించాయి. 2016 నాటి ఈ కథనాల ప్రకారం, ఆ ఫోటో కె.జె. ఏసుదాసు కేరళలోని శబరిమల దేవాలయాన్ని దర్శించుకున్నపటిది తీసినది. ఈ ఫోటో కలిగి ఉన్న వార్త కథనాల్ని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

కె.జె. ఏసుదాసు హిందూ మతం స్వీకరించారు అని పోస్టులో చేస్తున్న క్లెయిములో ఎంత నిజం ఉంది తెలుసుకోవటానికి ఇటువంటి వార్త ఏదైనా రిపోర్ట్ అయిందా అని వెతికితే, ఎటువంటి సమాచారం లభించలేదు. అయితే గతంలో, కె.జె. ఏసుదాసు  క్రైస్తవ మతం నుండి హిందూ మతానికి మారారు అని పుకార్లు వచ్చినప్పుడు. ఆయన సతీమణి ప్రభ ఏసుదాసు ఆ పుకార్లని తిరస్కరించారు. ఈ కథనాల్ని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరిగా, కె.జె. ఏసుదాసు క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మారలేదు.

Share.

About Author

Comments are closed.

scroll