JNU లీడర్ అయిషా ఘోష్ చేతికి అయిన గాయం నిజం కాదు అని కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ ఫేస్ బుక్ లో విస్తృతంగా ప్రచారం కాబడుతుంది. ఆ పోస్టు లోని క్లెయిమ్ ప్రకారం ఆమె చేతి కట్టు ఒక ఫోటోలో ఎడమ చేయికి ఉందని, ఇంకో ఫోటోలో మాత్రం కుడి చేయికి ఉంది. ఆ పోస్ట్ యొక్క క్లెయిమ్ లో ఎంత వరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్: రెండు ఫోటోల్లో వేర్వేరు చేతులకి కట్టు కట్టుకున్న JNU లీడర్ అయిషా ఘోష్ ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): అన్ని ఫోటోల్లో, వీడియోల్లో కూడా అయిషా ఘోష్ ఎడమ చేతికే కట్టు ఉంది. ఫోటో-ఎడిటింగ్ టూల్ ద్వారా ఒరిజినల్ ఫోటోని ఫ్లిప్ చేసి పోస్ట్ లోని ఒక ఫోటోలో ఉపయోగించారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
ఫోటో 1:
గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతకగా, అదే ఫోటో The Wire వారి ఆర్టికల్ లో కనిపించింది. అందులో ఉన్న ఫోటో ప్రకారం అయిషా ఘోష్ ఎడమ చేతికే కట్టు ఉంది.

ఫోటో 2:
పోస్ట్ లో పెట్టిన రెండు ఫోటోలు PTI (Press Trust of India) వెబ్సైటులో ‘Aisha Gosh press conference’ అనే వివరణ కింద కనిపించాయి. ఆ కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, అదే ఫోటో ‘The Indian Express’ వారి ఆర్టికల్ లో కనిపించింది. ఆ ఫోటోను పోస్ట్ లోని ఫోటో తో పోల్చి చూడగా అది దాని ప్రతిబింబం (మిర్రర్ ఇమేజ్) అని తెలుస్తుంది. పోస్టు లోని ఫొటోలో కుడి చేతికి కట్టు ఉంటే, ఒరిజినల్ ఫొటోలో మాత్రం ఎడమ చేతికి కట్టు ఉంటుంది. కుడి చేతికి కట్టు ఉండేట్టుగా చూపించడానికి, ఒరిజినల్ ఫోటోని ఫోటో-ఎడిటింగ్ టూల్ ఉపయోగించి ఎడమ చేతికి కట్టు ఉన్నట్టుగా చూపించారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.


అంతేకాక , ‘The Indian Express’ వారు 7th జనవరి, 2020న ప్రచురించిన ఆర్టికల్ లో అయిషా ఘోష్ ఎడమ చేతికి గాయం అయిందని చూడవచ్చు.
చివరగా, ఫోటో-ఎడిటింగ్ టూల్ ఉపయోగించి అయిషా ఘోష్ ఎడమ చేతి కట్టుని, కుడి చేతికి ఉన్నట్టుగా చూపించి ఆమెకి అయిన గాయం నిజం కాదు అని తప్పు ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?