భారత దేశ ఖ్యాతి ఖండ ఖండాలు చాటి చెప్పిన స్వామి వివేకానందుని వీడియో అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజముందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: స్వామి వివేకానంద ఉన్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో సాంప్రదాయ దుస్తులలో నడుస్తూ కనిపిస్తున్న వ్యక్తి పేరు స్వామి యోగానంద. తను అమెరికాలోని న్యూ యోర్క్ నగరాన్ని సందర్శించినప్పుడు తీసిన వీడియో ఇది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలో MIRC@SCEDU అనే వాటర్‌మార్క్ ఉండటం గమనించి, దాని గురించి ఇంటర్నెట్లో తగిన కి వర్డ్స్ ఉపయోగించి వెతికాము.
University of South Carolina వారి Moving Image Research Collections వెబ్సైటుకు అది దారి తీసింది. ఈ వెబ్సైటులో ఆర్కైవల్ ఫుటేజ్ యొక్క కలెక్షన్ ఉంటుంది. వీడియోలో ఉన్న లోగో ఈ వెబ్సైటులోని ఒక థంబ్ నైల్ పైన కూడా ఉంది. దాన్ని కింద చిత్రంలో గమనించవచ్చు.
స్వామి వివేకానంద, స్వామి అనే కీ వర్డ్స్ ఉన్నయోగించి ఇందులోని సెర్చ్ చెయ్యగా, వైరల్ వీడియోలో ఉన్న ఫుటేజ్ కలిగిన ఒక వీడియో దొరికింది.
ఈ 48 సెకెన్ల వీడియోలోని ఫుటేజ్ 34 సెకెన్ల దగ్గర నుంచి వైరల్ వీడియోతో మ్యాచ్ అవుతుంది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం అందులో సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి పేరు స్వామి యోగానంద. అమెరికాలోని న్యూ యార్కు నగరాన్ని ఆయన పర్యటించిన్నప్పుడు ఈ వీడియోని తీసినట్లు వీడియో వివరణలో ఉంది.
చివరిగా, స్వామి యోగానంద న్యూ యార్క్ నగరంలో నడుస్తున్న దృశ్యాలని స్వామి వివేకానందుడివి అని తప్పుగా షేర్ చేస్తున్నారు.