Fake News, Telugu
 

పోస్ట్‌లో ఉన్న ఎంపీ బండి సంజయ్‌ ర్యాంకు ఫోటో ‘పార్లమెంటరీ బిజినెస్’ అనే ప్రైవేట్ వెబ్సైటు సుమారు రెండేళ్ల క్రితం ఇచ్చినది

0

పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి 351 ర్యాంక్ వచ్చిందని చెప్తూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి 351వ ర్యాంక్ వచ్చింది. 

ఫాక్ట్: పోస్ట్‌లో ఉన్న ర్యాంకు ఫోటో ‘పార్లమెంటరీ బిజినెస్’ అనే ప్రైవేట్ వెబ్సైటుకి సంబంధించింది. ఆ వెబ్‌సైట్‌ ఇప్పుడు పనిచేయట్లేదు. ఫోటోలో ఉన్న బండి సంజయ్‌ ర్యాంకులు కూడా సుమారు రెండేళ్ల క్రితం ఆ వెబ్‌సైట్‌లో పెట్టినవి. కావున, ప్రస్తుతం పని చేయని వెబ్‌సైట్‌ రెండేళ్ల క్రితం పెట్టిన పాత ర్యాంకులను ఇప్పుడు పోస్ట్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్‌లోని ఫోటోలో పైన ‘పార్లమెంటరీ బిజినెస్’ అని రాసి ఉన్నట్టు చదవచ్చు. దాని గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రస్తుతం (ఈ ఆర్టికల్ రాసే సమయానికి) ఆ ప్రైవేట్ వెబ్‌సైట్‌ పని చేయట్లేదని తెలిసింది. కానీ, ఆ వెబ్‌సైట్‌ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మాత్రం ఇక్కడ చూడవచ్చు. ఫోటోలో ఉన్న బండి సంజయ్‌ ర్యాంకులు సుమారు రెండేళ్ల క్రితం ఆ వెబ్‌సైట్‌లో పెట్టినవని తెలిసింది. అంతేకాదు, వేటిని ఆధారంగా తీసుకుని ఆ ర్యాంకులు లెక్కించారనే సమాచారం లభించలేదు. 

ఎంపీ బండి సంజయ్ ‘పార్లమెంటరీ పెర్ఫార్మన్స్’కి సంబంధించిన అప్డేటెడ్ (20 డిసెంబర్ 2022 వరకు) సమాచారాన్ని ‘పీఆర్ఎస్ ఇండియా’ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. తను లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు లోక్ సభ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు. 

‘ఎంపీలాడ్స్‌’ పథకానికి సంబంధించి ఎంపీ బండి సంజయ్ పేరు మీద ఇప్పటివరకు విడుదలైన నిధుల వివరాలను ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, పోస్ట్‌లో ఉన్న ఎంపీ బండి సంజయ్‌ ర్యాంకు ఫోటో ‘పార్లమెంటరీ బిజినెస్’ అనే ప్రైవేట్ వెబ్సైటు సుమారు రెండేళ్ల క్రితం ఇచ్చినది. 

Share.

About Author

Comments are closed.

scroll