Fake News, Telugu
 

2016 లో జగన్ ప్రత్యేక హోదా కోసం చేసిన పూజ వీడియో తీసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా ఎన్నికైన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవ మతం వదిలేసి తిరిగి హిందుత్వంలోకి వచ్చారంటూ కొందరు ఫేస్బుక్ లో ఫోటోలు మరియు వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):  జగన్ క్రైస్తవ మతం వదిలేసి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు.

ఫాక్ట్ (నిజం): పాత వీడియో, ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇవి 2016 లో జగన్ రిషికేశ్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం హోమం మరియు పూజలు నిర్వహించినప్పుడు తీసినవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, అది 2016 లో జగన్ రిషికేశ్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం హోమం చేసినప్పుడు తీసిన ఫోటో అని తెలుస్తుంది. యుట్యూబ్ లో ‘Jagan Rishikesh Homam’  అని వెతికితే ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియోనే వస్తుంది.

జగన్ మతం గురించి ఇంకా వెతకగా, గత సంవత్సరం జగన్ వాళ్ళ తల్లి విజయమ్మ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ క్రిస్టియన్ అయిన తన కొడుకు గుడులకు వెళ్ళడం తప్పుకాదని చెప్పినట్టు చూడొచ్చు. అలానే ముఖ్యమంత్రి అయ్యాక ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ తను రోజు బైబిల్ చదువుతానని చెప్పాడు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా జగన్ తిరిగి హిందుత్వం తీసుకోలేదు.

చివరగా, 2016 లో జగన్ ప్రత్యేక హోదా కోసం చేసిన పూజ వీడియో తీసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll