Fake News, Telugu
 

పోస్టులో పోలింగ్ రోజున పడిన ఓట్ల సంఖ్య తప్పుగా ఇచ్చారు

0

పోలింగ్ రోజున పోలైన ఓట్ల సంఖ్య కంటే ఎన్నికల ఫలితాల రోజున EVMలు ఎక్కవ ఓట్లను చూపించాయి అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ లోని రెండు అసెంబ్లీ స్థానాల సంఖ్యలను ఉదాహరణగా ఫేస్బుక్ లో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ సంఖ్యల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కొవ్వూరు అసెంబ్లీ నియోజికవర్గంలో పోలింగ్ రోజున 1,24,315 ఓట్లు పడితే, ఫలితాల రోజున EVM లలో 1,51,849 ఓట్లు ఉన్నాయి. అలానే నిడదవోలు అసెంబ్లీ నియోజికవర్గంలో పోలింగ్ రోజున 1,27,496 ఓట్లు పడితే, ఫలితాల రోజున EVM లలో 1,66,978 ఓట్లు ఉన్నాయి.

ఫాక్ట్ (నిజం): ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ‘Voter Turnout’ మొబైల్ అప్లికేషన్ లో చూస్తే పోస్ట్ లో ఇచ్చిన పోలింగ్ రోజున పడిన ఓట్ల సంఖ్యలు తప్పని తెలుస్తాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఎన్నికల ఫలితాల రోజున EVM లలో వచ్చిన ఓట్ల సంఖ్యలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో దొరుకుతాయి. ముందుగా కొవ్వూరు లో EVM ఓట్లు ఫలితాల రోజున ఎన్ని వచ్చాయో చూడగా, 1,51,849 ఓట్లు వచ్చాయని తెలుస్తుంది.  అదే నిడదవోలు లో 1,66,978 ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. ఈ రెండు సంఖ్యలు పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలతో మ్యాచ్ అవుతాయి. కావున పోస్ట్ లో ఫలితాల రోజున EVM లో వచ్చిన ఓట్ల సంఖ్యలు కరెక్ట్ గానే ఇచ్చారు.

పోలింగ్ రోజున ఎంత మంది ఓటు వేసారో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ‘Voter Turnout’ మొబైల్ అప్లికేషన్ లో చూస్తే తెలుస్తుంది. ఆ అప్లికేషన్ లో పోలింగ్ రోజున కొవ్వూరు మరియి నిడదవోలు లో ఎంతమంది ఓటు వేసారో చూస్తే, కొవ్వూరు లో 1,52,466 మంది మరియు నిడదవోలు లో 1,72,656 మంది ఓటు వేసారని తెలుస్తుంది. పోస్ట్ లో ఈ సంఖ్యలు తప్పుగా ఇచ్చారు. పోస్ట్ లో చెప్పినట్టుగా EVMలలో ఓట్లు ఓటింగ్ రోజున వేసిన ఓట్ల కంటే ఎక్కువలేవు.

పవన్ కళ్యాణ్ నిలబడిన భీమవరం అసెంబ్లీ నియోజికవర్గంలో కూడా ఇలానే జరిగిందంటూ వచ్చిన పోస్ట్ ను ఇంతకు ముందే తప్పు అని చెప్తూ FACTLY ఆర్టికల్ రాసింది. 

చివరగా, పోస్టులో పోలింగ్ రోజున పడిన ఓట్ల సంఖ్యలు తప్పుగా ఇచ్చారు.

Share.

About Author

Comments are closed.

scroll