Fake News, Telugu
 

నిరసన కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులకు ఫైన్‌లు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని JNU వెనక్కి తీసుకుంది

0

JNUలో ఇకనుండి ధర్నా చేసిన విద్యార్థికి ₹20 వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: JNUలో ఇకనుండి ధర్నా చేసిన విద్యార్థికి ₹20 వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు.

ఫాక్ట్(నిజం): JNUలో నిరసన కార్యక్రమాలకు పాల్పడే విద్యార్థులకు రూ. 20000 నుండి 50000 వరకు ఫైన్‌లు విధించేలా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, ఆ తరవాత కొన్ని పరిపాలన కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చెప్తున్నట్టు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ గత నెలలో యూనివర్సిటీ క్రమశిక్షణా నియమాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. యూనివర్సిటీ క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించిన విద్యార్థులు ఎదురుకోవాల్సిన పరిణామాల గురించి ఇందులో పేర్కొన్నారు.

నోటిఫికేషన్ ప్రకారం యూనివర్సిటీ విద్యార్థులేవరైనా ధర్నాలు, నిరాహారదీక్షలు మొదలైన నిరసన కార్యక్రమాలలో పాల్గొంటే, వారికి రూ. 20,000 వరకు ఫైన్, బెదిరింపులు మొదలైనవాటికి పాల్పడితే రూ. 50,000 వరకు ఫైన్ విధిస్తారు.

తీవ్రతను బట్టి విద్యార్థులను సస్పెండ్ చేయడం మరియు అడ్మిషన్ రద్దు చేయడం కూడా జరుగుతుందని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ నిర్ణయాన్ని JNU వెనక్కి తీసుకుంది:

ఐతే క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధించడానికి సంబంధించి JNU వెనక్కి తగ్గింది. ముందు జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు JNU ఇటీవల 02 మార్చ్ 2023న ప్రకటించింది. కొన్ని పరిపాలన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు JNU తెలిపింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ముందుగా JNU నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ఫైన్ విధించేలా నిర్ణయం తీసుకున్నా, ఆ తరవాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలీకుండా కేవలం JNU ఫైన్లు విధించిన వార్తను మాత్రమే షేర్ చేస్తున్నారు.

చివరగా, నిరసన కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులకు ఫైన్‌లు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని JNU వెనక్కి తీసుకుంది.

Share.

About Author

Comments are closed.

scroll