Fake News, Telugu
 

అదానీ షేర్ల పతనం నేపథ్యంలో LICకి జరిగిన నష్టాలపై దీపికా పదుకొనే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు

0

అదానీ వ్యాపారాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదల తరవాత LIC తన పెట్టుబడి మీద లాభాల్లో కొంత కోల్పోయిన విషయం తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పడుకొనే LIC నష్టాలపై వ్యాఖ్యానించినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘67 సంవత్సరాల చరిత్ర లో LIC డబ్బులు ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, కానీ ఈ రోజు మొదటి సారి 18 వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది ఎందుకంటే దేశం సురక్షితమైన వారి చేతుల్లో లేదు’  అని దీపికా అన్నట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 67 సంవత్సరాల చరిత్ర లో LIC డబ్బులు ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, కానీ ఈ రోజు మొదటి సారి 18 వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది ఎందుకంటే దేశం సురక్షితమైన వారి చేతుల్లో లేదు’  – దీపికా పదుకొనే

ఫాక్ట్(నిజం): హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనతరం అదానీ షేర్‌ల ద్వారా LIC పెట్టుబడి విలువ, నష్టాల గురుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా LIC తాము చేసిన పెట్టుబడుల వల్ల గతంలో కూడా నష్టపోయింది, ఇదేం కొత్త కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

గత నెల హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనతరం అదానీ కంపెనీల షేర్ల విలువ పడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే అదానీ కంపెనీలలో LIC కూడా పెట్టుబడి పెట్టడంతో LIC పెట్టుబడి విలువ కూడా నష్టపోయింది. ఈ విషయాలకు సంబంధించి LIC ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

అదానీ సంస్థలలో మొత్తంగా రూ. 30,127 కోట్లు పెట్టుబడి పెడితే, 27 జనవరి 2023 నాటి మార్కెట్ ధరతో చూస్తే LIC పెట్టుబడి విలువ రూ. 56, 142 కోట్లకు చేరుకుందని LIC ఈ ప్రకటనలో తెలిపింది. మార్కెట్ ఒడిదుడుకులలో LIC పెట్టుబడి విలువ పడిపోయిన మాట నిజమైనప్పటికీ, అదానీలో చేసిన పెట్టుబడులకు సంబంధించి మాత్రం LIC లాభాల్లోనే ఉంది.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ ఆమె నిజంగానే పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవీ లభించలేదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా ఈ అంశంపై ఎలాంటి పోస్టులు చేయలేదు. (ఇక్కడ మరియు ఇక్కడ).

గతంలో కూడా LIC నష్టపోయింది:

సాధారణంగా LIC వివిధ ప్రైవేటు మరియు ప్రభుత్వ కంపెనీల షేర్లు, ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటుంది. ఐతే ఈ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. LIC తాము పెట్టుబడి పెట్టిన షేర్‌ల విలువ పడిపోవడం వల్ల గతంలో కూడా నష్టాలూ చూసింది.

కేవలం బీజేపీ ప్రభుత్వంలో మాత్రమే కాడుండా అంతకు ముందున్న ప్రభుత్వాల సమయంలో కూడా తాము చేసిన పెట్టుబడుల వల్ల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, అదానీ షేర్ల పతనం నేపథ్యంలో LICకి జరిగిన నష్టాలపై దీపికా పదుకొనే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll