Fake News, Telugu
 

SBIలో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద పొందే ఇన్సూరెన్స్ మొత్తం కరోనా మరణాలకు వర్తించదు

0

‘SBI బ్యాంకులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద ఖాతా ఉన్న ఉద్యోగులకు కరోనా వల్ల మరణిస్తే ఇరవై లక్షల భీమా వస్తుందని’ చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘SBI బ్యాంకులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద ఖాతా ఉన్న ఉద్యోగులకు కరోనా వల్ల మరణిస్తే ఇరవై లక్షల భీమా వస్తుంది’.

ఫాక్ట్ (నిజం): SBIలో రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్స్/ ప్రొఫెసర్ల మొదలైన వారు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద శాలరీ అకౌంట్ పొందవచ్చు. ఈ అకౌంట్స్ కలిగిన వారికి రూ. 20 లక్షల వరకు ఇన్సురన్స్ బెనిఫిట్స్ అందిస్తునప్పటికి, ఈ ఇన్సూరెన్స్ కరోనా మరణాలకు వర్తించదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ స్కూల్స్, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో టీచర్స్/ ప్రొఫెసర్లతో పాటు  కార్పొరేషన్ లేదా బోర్డులలో పెర్మనెంట్ ఉద్యోగులు మొదలైన వారు SBIలో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద శాలరీ అకౌంట్ పొందవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం SBI వెబ్సైటులో కూడా ఉంది. నెల జీతం ఆధారంగా గోల్డ్, సిల్వర్, డైమండ్ మరియు ప్లాటినం అనే నాలుగు రకాల అకౌంట్స్ ఈ ప్యాకేజీ కింద పొందవచ్చు.

ఈ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఉద్యోగస్తులు రూ. 20 లక్షల వరకు పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ (చనిపోయినప్పుడు), రూ. 30 లక్షల ఎయిర్ ఆక్సిడెంట్ ఇన్సురన్స్ (చనిపోయినప్పుడు), హోం/కార్/ఎడ్యుకేషన్ లోన్స్ మొదలైన పలు బెనిఫిట్స్ పొందవచ్చు.

ఐతే SGSP కింద పొందే ఇన్సూరెన్స్ కరోనాకి కూడా వర్తిస్తుందని చెప్పే ఎటువంటి సమాచారం SBI వెబ్సైటులో లేదు. SGSP పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొనే విధానానికి సంబంధించిన సమాచారంలో కూడా కరోనా గురించి అసలు ప్రస్తావించలేదు. ఈ విషయానికి సంబంధించి మరింత వివరణ కోసం FACTLY ఒక SBI బ్యాంక్ మేనేజర్ ని సంప్రదించగా,   స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ కింద కరోనాకి ఇన్సూరెన్స్ వర్తించదని, కేవలం ఆక్సిడెంట్ కేసులలో మాత్రమే రూ. 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని స్పష్టం చేసారు. పైగా SGSP కింద కరోనా మరణాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు గాని లేక బ్యాంకు సమాచారం గాని మాకు లభించలేదు. దీన్నిబట్టి, SBIలో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద పొందే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కరోనాకి వర్తించవని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.

ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రధాన్ మంత్రి సురక్ష బీమ యోజన (PMSBY) ద్వారా కరోనా మరణాలకు ఇన్సూరెన్స్ పొందవచన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయినప్పుడ్డు FACTLY ఈ వార్తని తప్పని చెప్తూ రాసిన కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, SBIలో  స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద పొందే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కరోనా మరణాలకు వర్తించవు.

Share.

About Author

Comments are closed.

scroll