ఏప్రిల్ 2020 నుండి సెప్టెంబర్ 2020 మధ్యలో NRC (నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజన్స్) ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్తూ ఒక నోటిఫికేషన్ ఫోటోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: ఏప్రిల్ 2020 నుండి సెప్టెంబర్ 2020 మధ్యలో NRC ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫాక్ట్ (నిజం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది NPR ని నిర్వహించడానికి, NRC కోసం కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని విషయాన్నే చెప్తూ నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో అదే నోటిఫికేషన్ ఫోటో ని పోస్ట్ చేసినట్టు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవొచ్చు.
ఆ నోటిఫికేషన్ ని చదివితే, అది NPR (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) నిర్వహించాడినికి విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అని తెలుస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కాదు, మిగితా రాష్ట్రల ప్రభుత్వాలు కూడా NPR కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ని విడుదల చేసాయి. ఉదాహరణకు తెలంగాణ మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ల ఫోటోలను కింద చూడవొచ్చు.
ఏప్రిల్ 2020 నుండి సెప్టెంబర్ 2020 మధ్యలో NPR (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) నిర్వహించాడినికి 3,941.35 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెన్సస్ మరియు NPR మధ్య తేడా గురించి ఇక్కడ చదవొచ్చు. NRC మరియు NPR మధ్య తేడా గురించి ఇక్కడ చదవొచ్చు.
NRC మరియు NPR మధ్య ఎటువంటి లింక్ లేదు అని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కానీ, ‘నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR), ఎన్ఆర్సీకి మొదటి అడుగు అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది’ అని లోకేష్ మరో ట్వీట్ చేసారు. NRC మరియు NPR మధ్య లింక్ ఉన్నది అని కొందరి వాదన; లేదు అని మరికొందరి వాదన. కానీ, ఏప్రిల్ 2020 నుండి సెప్టెంబర్ 2020 మధ్యలో NRC ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ మాత్రం విడుదల చేయలేదు.
చివరగా, NPR నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, NRC కోసం కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?