Fake News, Telugu
 

రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా డోనాల్డ్ ట్రంప్ మైక్ పెన్స్ ని నామినేట్ చేసాడు, నిక్కి హేలీని కాదు

0

డోనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి అయిన కమల హారిస్ కు ధీటుగా ఇండో అమెరికన్ అయిన నిక్కి హేలీని రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నామినేట్ చేసాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: డోనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి అయిన కమల హారిస్ కు ధీటుగా ఇండో అమెరికన్ అయిన నిక్కి హేలీని రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నామినేట్ చేసాడు.

ఫాక్ట్(నిజం): ఆగస్టు 2020లో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా మైక్ పెన్స్ ని నామినేట్ చేసారు. ఈ నామినేషన్ ని మైక్ పెన్స్ అంగీకరించాడు కూడా. దీన్నిబట్టి నిక్కిహేలీ రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి కాదని కచ్చితంగా చెప్పొచు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వార్త గురించి మరింత సమాచారం కోసం మేము గూగుల్ లో వెతకగా ఇటేవలె ఆగస్టు 2020లో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా మైక్ పెన్స్ ని నామినేట్ చేసినట్టుగా తెలిసింది. ఇంకా ఈ కన్వెన్షన్ లో మైక్ పెన్స్ ఈ నామినేషన్ ని అంగీకరించాడు కూడా. ఇదే విషయాన్ని RNC అధికారిక వెబ్సైటు మరియు ట్విట్టర్ ఎకౌంటులో కూడా చూడొచ్చు. దీన్నిబట్టి నిక్కిహేలీ రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి కాదని కచ్చితంగా చెప్పొచు.

ఐతే నిక్కి హేలీ వేరే ఇతర పదవికి పోటి చేస్తుందన్న వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని మాకు లభించలేదు.

చివరగా, 2020 రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నిక్కి హేలీని డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll