Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని హత్రాస్ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న యోగి ఆదిత్యనాథ్ అని షేర్ చేస్తున్నారు

0

హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలి దహన సంస్కారాలు ల్యాప్టాప్ లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాధితురాలి మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు బలవంతంగా దహనం చేయడం పై పలు విమర్శలు వచ్చాయి. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలి అంత్యక్రియలను ల్యాప్టాప్ లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది. హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలి కుటుంబంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల్యాప్టాప్  ద్వార సంభాషిస్తున్నాప్పుడు తీసిన ఫోటో ఇది. లాప్టాప్ లో కనిపిస్తున్న దృశ్యాన్ని, బాధితురాలి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటోతో మార్ఫ్ చేసి ఇలా వైరల్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఒరిజినల్ ఫోటోని షేర్ చేస్తూ ‘Hindustan Times’ న్యూస్ వెబ్ సైట్ ‘30 సెప్టెంబర్ 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. హత్రాస్ అత్యాచార ఘటనలో మరణించిన బాధితురాలి కుటుంబంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల్యాప్టాప్  ద్వార సంభాషిస్తున్న దృశ్యం, అని ఆర్టికల్ లోని ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ ఘటనకి సంబంధించిన దోషులని తప్పక శిక్ష పడేలా చేస్తామని యోగి ఆదిత్యనాథ్ బాధితురాలి కుటుంబానికి భరోసా ఇచ్చారని ఆర్టికల్ లో తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ల్యాప్టాప్ ద్వార బాధితురాలి కుటుంబంతో మాట్లాడుతున్న దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు. అయితే, ఈ వీడియోలో గాని, ఆర్టికల్ లోని ఫోటోలో గాని యోగి ఆదిత్యనాథ్ బాధితురాలి అంత్యక్రియలు చూస్తున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు.

హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలకి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతకగా, పోస్టులోని అదే ఫోటోని షేర్ చేస్తూ ‘IBT Times’ న్యూస్ వెబ్ సైట్ ఈ ఫోటోని, అంత్యక్రియలు జరుగుతున్న దృశ్యాలని షేర్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. బాధితురాలి మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు బలవంతంగా దహనం చేసారని ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా, పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, యోగి ఆదిత్యనాథ్ ల్యాప్టాప్ లో హత్రాస్ బాధితురాలి దహన సంస్కారాలు విక్షిస్తున్నట్టుగా షేర్ అవుతున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది.

Share.

About Author

Comments are closed.

scroll