ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో తాజాగా జరిగిన ఘటన, బాధితురాలి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి, తనకు సంబంధించిన కాగితాలు, సర్టిఫికెట్లు తీసుకొని వేళ్తున్న యూపీ పోలీసులు అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హత్రాస్ బాధితురాలి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి, తనకు సంబంధించిన కాగితాలు, సర్టిఫికెట్లు తీసుకొని వేళ్తున్న యూపీ పోలీసుల వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటనకీ, హత్రాస్ ఘటన బాధితురాలికి ఎటువంటి సంబంధంలేదు. వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది. తమ స్థలంలో పోలీసులు చౌకీ కట్టడానికి ప్రయత్నించగా, దాని పై తాము కోర్టు నుండి స్టే తెచ్చామని, తాజాగా పోలీసులు తమ ఇంట్లోకి బలవంతంగా వచ్చి కాగితాల పై వేలిముద్రలు పెట్టించబోయరని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన పై కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కావున, యూపీ లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఘటన వీడియో పెట్టి, హత్రాస్ ఘటన బాధితురాలి కి సంబంధించిన వీడియోగా చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లోని వీడియో గురించి తెలుసుకోవడం కోసం ఇంటర్నెట్ లో కొన్ని కీ-వర్డ్స్ తో వెతకగా, అదే వీడియోని కొందరు ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో జరిగినట్టు రాసారని తెలుస్తుంది. అంతేకాదు, ఒకరు ట్విట్టర్ లో అదే వీడియోని పోస్ట్ చేయగా, ఆ ఘటన పై కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతున్నామని ఉన్నావ్ పోలీసులు ఆ ట్వీట్ కి బదులిచ్చారు. కావున, వీడియోలోని ఘటన హత్రాస్ లో జరగలేదు.
తమ స్థలంలో పోలీసులు చౌకీ కట్టడానికి ప్రయత్నించగా, దాని పై తాము కోర్టు నుండి స్టే తెచ్చామని, తాజాగా పోలీసులు తమ ఇంట్లోకి బలవంతంగా వచ్చి కాగితాల పై వేలిముద్రలు పెట్టించబోయరని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనకి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, వీడియోలోని ఘటనకీ, హత్రాస్ ఘటన బాధితురాలికి ఎటువంటి సంబంధంలేదు. వీడియోలోని ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది.