Fake News, Telugu
 

ఈ పోస్టులోని వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్ చేసినవి కాదు

0

“ఆడవాళ్ళని చుస్తే మగవాళ్ళకి అత్యాచారం చేయాలనిపిస్తుంది, అందుకే స్త్రీలు వంట గదికే పరిమితం అవ్వాలి” అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నట్టుగా చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆడవాళ్ళని చుస్తే మగవాళ్ళకి అత్యాచారం చేయాలనిపిస్తుంది, అందుకే స్త్రీలు వంట గదికే పరిమితం అవ్వాలి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నాడు.

ఫాక్ట్(నిజం): పోస్టులోని వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్ నిజంగానే అన్నట్టు అధరాలు లేవు. దీనికి సంబంధించి ఎలాంటి వార్తా కథనాలు కూడా లేవు. కాకపోతే యోగి తన వెబ్సైటు లో ఆడవారి గురించి రాసిన ఒక వ్యాసంలో వారిని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

యోగి ఆదిత్యనాథ్ పోస్టులోని వ్యాఖ్యలు నిజంగానే చేసినట్టు వార్తా కథనాలు గాని అధికారిక /అనధికారిక సమాచారంగాని మాకు లభించలేదు. యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఐతే యోగి ఆదిత్యనాథ్ తన వెబ్సైటులో రాసిన “मातृशक्ति  भारतीय संस्कृति के सन्दर्भ में” (భారతీయ సంసకృతి నేపథ్యంలో మాతృశక్తి) అనే వ్యాసంలో స్త్రీల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాసం యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు. యోగి రాసిన వ్యాసంలోని కొన్ని వ్యాఖ్యలు కింద చూడొచ్చు.

“స్త్రీలను చిన్న వయసులో తండ్రి, యవ్వనంలో భర్త, వృధ్యాప్యంలో కొడుకుల చేత రక్షింపబడతాడు. శాస్త్రాలు కూడా స్త్రీలని అన్ని వేళల రక్షించాలని చెప్తున్నాయి కాబట్టి స్త్రీలలకు ఒంటరిగా ఉండే సామర్ధ్యం లేదు”

“మగవారికి పురుష లక్షణాలతో పాటు స్త్రీ లక్షణాలు వంటివి ఉంటె వారు దేవుడవుతారు. అదే స్త్రీలకి మగ  లక్షణాలు వస్తే వారు రాక్షసులవుతారు”

“స్త్రీలను ఎప్పుడు పరిరక్షించాలి, స్త్రీలకి స్వతంత్రం అవసరంలేదు. స్త్రీలను రక్షించి వారి శక్తికి దారి చూపాలి”

 యోగి రాసిన ఈ వ్యాసం గురించిన వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన 19 ఏళ్ళ యువతి అత్యాచార ఘటన నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్త లాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా  షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్ చేసినవి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll