Fake News, Telugu
 

చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్ లో కలుపుతూ హాంగ్ కాంగ్ ఎటువంటి మ్యాప్ ను ఆమోదించలేదు

0

‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో సహా, చైనా ఆక్రమించుకున్న అక్సాయ్‌చిన్, థగ్-ల-రిడ్జి, కింజిమనె, టిబెట్ అటానమస్ రీజియన్ లను భారత్ లో కలుపుతూ తయారు చేసిన కొత్త మ్యాప్ ను ఆమోదించిన రిపబ్లిక్ అఫ్ హాంగ్ కాంగ్’ అని చెప్తూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్ లో కలుపుతూ తయారు చేసిన కొత్త మ్యాప్ ను ఆమోదించిన రిపబ్లిక్ అఫ్ హాంగ్ కాంగ్. 

ఫాక్ట్ (నిజం): ): హాంగ్ కాంగ్ అనేది చైనాకి చెందిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతం. అలాంటి ఎటువంటి మ్యాప్ ను హాంగ్ కాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించలేదు. పోస్ట్ చేసిన ఫోటోలో హాంగ్ కాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన ‘National Anthem Ordinance’ పై హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ సంతకం పెడుతుంది. దానికీ, భారతదేశం మ్యాప్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి వెతకగా, అలాంటి మ్యాప్ ను హాంగ్ కాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. హాంగ్ కాంగ్ అనేది చైనాకి చెందిన ప్రత్యేక పరిపాలనా ప్రాంతం. హాంగ్ కాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవొచ్చు.

పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, అదే ఫోటో హాంగ్ కాంగ్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్ లో ‘National Anthem Ordinance’  పై హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ సంతకం అని టైటిల్ తో ఉన్న ఆర్టికల్ లో ఉన్నట్టు చూడవొచ్చు. చైనా జాతీయ గీతానికి హాంగ్ కాంగ్ లో కూడా గౌరవం అందేలా ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆ చట్టానికీ, భారతదేశం మ్యాప్ కి ఎటువంటి సంబంధంలేదు. ఆ చట్టానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ ని ఇక్కడ చదవొచ్చు.

అయితే, ‘Carrie Lam Cheng 林鄭月娥’ (@carrielamcheng) అని పేరుతో ఒక ట్విట్టర్ యూసర్ పోస్ట్ లోని విషయాన్నే ఇంగ్లీష్ లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవచ్చు. కానీ, అది హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ ట్విట్టర్ అకౌంట్ కాదు. అసలు తనకు అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు. 2014 లో ‘@carrielamcheng’ చేసిన ట్వీట్లు చూస్తే, తను భారత్ నుండి ట్వీట్లు చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య చేసిన ట్వీట్లును వదిలేస్తే, మిగితా అన్నీ భారత్ కు సంబంధించిన ట్వీట్లు చేసినట్టు చూడవొచ్చు. 2014 లో తను చేసిన ట్వీట్లకు ఇచ్చిన రిప్లైలలో తన ప్రొఫైల్ పేరు ‘@dreamer_patel7’ అని ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, హాంగ్ కాంగ్ అధికారిక వెబ్ సైట్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కారీ లామ్ కి సంబంధించి కేవలం ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రాం అధికారిక అకౌంట్ల లింకులు ఇచ్చినట్టు చూడవొచ్చు

చివరగా, చైనా ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్ లో కలుపుతూ హాంగ్ కాంగ్ ఎటువంటి మ్యాప్ ను ఆమోదించలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll