Fake News, Telugu
 

ఫ్లోరోనా అనేది కొత్త కోవిడ్-19 వేరియంట్ కాదు; ఇన్‌ఫ్లూయెంజా మరియు కరోనా రెండు సోకిన కండిషన్‌ని ఫ్లోరోనా అంటారు

0

‘ఇజ్రాయిల్‌లో ఫ్లోరోనా పేరుతో కొత్తరకం కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చిందని’ రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తా కథనంలో చెప్తున్న విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయిల్‌లో ఫ్లోరోనా పేరుతో కొత్తరకం కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

ఫాక్ట్ (నిజం): ఫ్లోరోనా అనేది కోవిడ్-19 వేరియంట్ కాదు. ఇటీవల ఇజ్రాయిల్‌లో ఒక గర్భిణిలో ఇన్‌ఫ్లూయెంజా మరియు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన కండిషన్‌ని ఫ్లోరోనా అంటూ నామకరణం చేసారు. సాధారణంగా WHO గ్రీక్ అక్షరాలతో కూడిన ఒక ఆల్ఫాన్యూమరిక్ పేర్లను కరోనా వైరస్ వేరియంట్లకు కేటాయిస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలానే డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లు ఒకేసారి ఇన్ఫెక్ట్ అయిన కండిషన్‌ని కూడా గుర్తించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల ఇజ్రాయిల్‌లో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఒక గర్భిణి స్త్రీలో ఇన్‌ఫ్లూయెంజా మరియు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది, ఐతే ఇలా ఒకేసారి ఈ రెండు ఇన్ఫెక్షన్స్ (“డబుల్ ఇన్ఫెక్షన్” లేదా “కో-ఇన్ఫెక్షన్”) సోకిన కండిషన్‌ని అక్కడి డాక్టర్లు ‘ఫ్లోరోనా’ అంటూ నామకరణం చేసారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫ్లోరోనా అనేది ఒక కరోనా వేరియంట్ కాదు, అది ఒక కండిషన్ మాత్రమే. ఇంతకు ముందు కూడా ఇలానే డెల్టా మరియు ఓమిక్రాన్ వేరియంట్లు ఒకేసారి ఇన్ఫెక్ట్ అయిన కండిషన్‌ని కూడా గుర్తించారు, దీనికి డెల్‌మిక్రాన్ అనే పేరు పెట్టారు.

ఐతే ఈ విషయాన్నీ కొందరు తప్పుగా అర్ధం చేసుకొని ఫ్లోరోనా అనేది ఒక కొత్త కరోనా వేరియంట్ అంటూ వార్తలు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌తో పాటు చాలా వరకు దేశాలలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు ప్రజలను భయందోళనలకు గురిచేసే అవకాశం ఉంది.

సాధారణంగా కరోనా వేరియంట్ల పేర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయిస్తుంది, గ్రీక్ అక్షరాలతో కూడిన ఒక ఆల్ఫాన్యూమరిక్ పేర్లను కరోనా వైరస్ వేరియంట్లకు కేటాయిస్తూ వచ్చింది. కరోనా వేరియంట్ల పేర్లకు సంబంధించిన పూర్తి సమాచారం WHO వెబ్సైటులో చూడొచ్చు. ఐతే ఈ సమాచారంలో ఫ్లోరోనా పేరుతో ఎటువంటి కరోనా వేరియంట్ లేదు.

కోవిడ్-19 మరియు ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) రెండూ శ్వాసకోశకు సంబంధించిన అంటు వ్యాధులు. రెండు వ్యాధులకు సంబంధించి కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, ఈ రెండు వేరువేరు వైరసుల వల్ల సంభవిస్తాయి. రెండింటికి ట్రీట్మెంట్లు మరియు వాక్సిన్లు వేరువేరు. కోవిడ్-19 మరియు ఇన్‌ఫ్లూయెంజా రెండూ సోకినవారు రెండింటికి సంబంధించిన వాక్సిన్ తీసుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారం WHO వెబ్సైటులో చూడొచ్చు.

చివరగా, ఫ్లోరోనా అనేది కొత్త కోవిడ్-19 వేరియంట్ కాదు. ఇన్‌ఫ్లూయెంజా మరియు కరోనా రెండు సోకిన కండిషన్‌ని ఫ్లోరోనా అంటారు.

`

Share.

About Author

Comments are closed.

scroll