Fake News, Telugu
 

టాటా Evision అనేది కేవలం కాన్సెప్ట్ కారు మాత్రమే, పైగా ఈ బ్యాటరీ వివరాలు కూడా తప్పు

0

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్స్ ప్రయాణించే విధంగా టాటా కంపెనీ Evision అనే పేరుతో ఒక ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయబోతుందని, ఈ బ్యాటరీకి పదేళ్ళ వారంటీ మరియు కారు ధర రూ. 25 లక్షలని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఇదే విషయం చెప్తున్న ఒక యూట్యూబ్ వీడియో కూడా ఎక్కువగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: టాటా Evision కారు బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్స్ ప్రయాణించొచ్చు. ఈ బ్యాటరీ వారంటీ పదేళ్ళు మరియు కారు ధర రూ. 25 లక్షలు.

ఫాక్ట్(నిజం): 2018లో జరిగిన జెనీవా మోటార్ షో లో మొదటిసారిగా టాటా Evision కారుని ప్రదర్శించారు. టాటా మోటార్స్ వెబ్సైటులో ఈ కార్ కి సంబంధించి ఉన్న ప్రోడక్ట్ నోట్ మరియు స్పెసిఫికేషన్ షీట్ లో బాటరీకి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. ఇది కేవలం ఒక కాన్సెప్ట్ కార్ మాత్రమే, ఈ కార్ యొక్క రెగ్యులర్ ప్రొడక్షన్ కి సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. టాటా మోటార్స్ CEO & MD అయిన Guenter Butschek ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  Evision కార్ టెక్నికల్ గా సాధ్యమైనప్పటికి కమర్షియల్ గా ఆచరణీయమైనది కాదని తెలిపాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

‘tata motors evision’ అనే కీవర్డ్ తో గూగుల్ లో వెతకగా టాటా మోటార్స్ మొదట ఈ కార్ ని 2018లో జరిగిన జెనీవా మోటార్ షో లో ప్రదర్శించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే టాటా మోటార్స్ వెబ్సైటులో ఈ కార్ కి సంబంధించి ఉన్న ప్రోడక్ట్ నోట్ మరియు స్పెసిఫికేషన్ షీట్ లో బాటరీకి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుపలేదు. టాటా మోటార్స్ ఈ కార్ ని జెనీవా మోటార్ షో లో ప్రదర్శించినప్పుడు కూడా ఈ కార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్స్ ప్రయాణించవచ్చని గాని మరియు బ్యాటరీకి 10 సంవత్సరాల వారంటీ ఇస్తామని గాని ఎక్కడా చెప్పలేదు.

2018లో ఈ కార్ కి సంబంధించి ఇటువంటి వార్తలే వైరల్ అయినప్పుడు సురేష్ రంగరాజన్, అప్పటి హెడ్ అఫ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, టాటా మోటార్స్ ఈ వార్తలో నిజంలేదని చెప్పారు. 2018లో ఈ వార్త వైరల్ అయినప్పుడు ఫాక్ట్-చెక్ చేసిన స్టోరీస్ కొన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. బ్యాటరీకి సంబంధించి ఈ విషయాలు తెలుపుతూ ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు.

ఐతే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఒక కాన్సెప్ట్ కార్ మాత్రమే, ఈ కార్ యొక్క రెగ్యులర్ ప్రొడక్షన్ కి సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఐతే జనవరి, 2020లో టాటా మోటార్స్ CEO & MD అయిన Guenter Butschek ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  Evision కార్ టెక్నికల్ గా సాధ్యమైనప్పటికి కమర్షియల్ గా ఆచరణీయమైనది కాదని తెలిపాడు.

ఇప్పటివరకైతే టాటా టియాగో సెడాన్ మరియు నెక్సాన్ SUV ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కార్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్స్ వరకు ప్రయాణించొచ్చు. ఐతే అల్ట్రోజ్ మరియు హారియర్ SUV కార్ల యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ప్రారంభించే ఆలోచలనలో ఉన్నట్టు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ అయిన శైలేష్ చంద్ర ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.  టాటా Evision కారుని ఈ ఏడాది మధ్యలో విడుదల చేస్తారన్న సమాచారం లేదు.

చివరగా, టాటా Evision అనేది కేవలం కాన్సెప్ట్ కారు మాత్రమే, పైగా ఈ బ్యాటరీ వివరాలు కూడా తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll