Fake News, Telugu
 

పెట్రోల్ పంప్ లో మంటలు చెలరేగిన ఈ ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని జున్జును జిల్లాలో జరిగింది

0

Update (23 June 2023):

మంచిర్యాల పెట్రోల్ బంక్ లో కస్టమర్ ఫోన్ వాడడం వల్ల అగ్నిప్రమాదం జరిగిందంటూ ఇదే వీడియోని ఇప్పుడు కొందరు షేర్ చేస్తున్నారు. అయితే క్రింద వివరించినట్టు ఈ ఘటన జరిగింది రాజస్తాన్ రాష్ట్రంలోని జున్జును జిల్లాలో, పైగా మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదని కొన్ని వార్తా కథనాలలో రాస్తే మరికొన్ని వార్తా కథనాలలో మాత్రం మంటలు వ్యపించాడనికి సానిటైజేర్ కారణం అని రాసాయి.

Published (05 August 2020):

జడ్చెర్లలో బైక్ కవర్ లో సానిటైజేర్ పెట్టుకోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనకి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ లో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జడ్చెర్లలో బైక్ కవర్ లో సానిటైజేర్ పెట్టుకోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.

ఫాక్ట్ (నిజం): ఈ ఘటన జరిగింది రాజస్తాన్ రాష్ట్రంలోని జున్జును జిల్లాలో, పైగా మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదని కొన్ని వార్తా కథనాలలో రాస్తే మరికొన్ని వార్తా కథనాలలో మాత్రం మంటలు వ్యపించాడనికి సానిటైజేర్ కారణం అని రాసాయి. కారణాలు కచ్చితంగా చెప్పలేనప్పటికీ ఘటన మాత్రం జడ్చెర్ల లో జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో గురించి మరింత సమాచారం కోసం మేము గూగుల్ లో వెతకగా, ఈ వీడియోకి సంబంధించి  కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఐతే ఈ వార్తా కథనాల ప్రకారం ఈ ఘటన 24 జూలై 2020న రాజస్తాన్ రాష్ట్రంలోని జున్జును జిల్లా లోని చిరావ మండలంలో జరిగింది. దీన్నిబట్టి ఈ ఘటన జడ్చెర్లలో జరగలేదని చెప్పొచ్చు. ఈ ఘటనని ప్రచురించిన కొన్ని న్యూస్ పోర్టల్ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే కొన్ని వార్తా కథనాలలో ఘటన జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉంది కాని మరికొన్ని వార్తా కథనాలలో మంటలు వ్యపించాడనికి సానిటైజేర్ కారణం అని ఉంది. మంటలు బైక్ కవర్ లో ఉన్న సానిటైజేర్ వల్ల వ్యాపించాయని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు మాకు దొరకలేదు. ఈ ఘటనకి సంబంధించి మరికొన్ని కథనాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, రాజస్తాన్ లో జరిగిన ఈ ఘటనని జడ్చెర్ల లో జరిగిందని ప్రచారం చేస్తున్నారు. పైగా మంటలు బైక్ కవర్ లో ఉన్న సానిటైజేర్ వల్ల వ్యాపించాయని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll