Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోలని హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా ‘లాంగ్ మార్చ్ 5బి’ రాకెట్ కి ముడిపెడ్తున్నారు

0

హిందూ మహాసముద్రంలో చైనా ‘లాంగ్ మార్చ్ 5బి’ రాకెట్ కుప్పకులుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 29 ఏప్రిల్ 2021 నాడు చైనా లాంచ్ చేసిన ‘The Long March-5b’ రాకెట్ యొక్క శకలాలు, అంతరిక్షంలో నియంత్రణ తప్పి 09 మే 2021 నాడు హిందూ సముద్రంలో పడిపోయాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హిందూ మహాసముద్రంలో చైనా ‘లాంగ్ మార్చ్ 5బి’ రాకెట్ కులిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో షేర్ చేసిన వీడియోలు పాతవి. ఈ వీడియోలకి హిందూ మహాసముద్రంలో ఇటివల కూలిపోయిన చైనా ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియో-1 (ఆర్కైవ్డ్):

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 26 మార్చి 2021 నాడు ఒక యూసర్ తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది SpaceX Falcon 9 రాకెట్ యొక్క శకలాలని ఈ పోస్టులో తెలిపారు. Space X Falcon 9 రాకెట్ శకలాలు ఆకాశంలో కాలిపోతున్న ఈ దృశ్యాలు వాషింగ్టన్ మరియు ఒరెగాన్ ప్రదేశాలలో కనిపించినట్టు ఈ పోస్టులో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో ‘imgur’ వెబ్సైటులో ఒక యూసర్ పబ్లిష్ చేసారు.

25 మర్చి 2021 నాడు SpaceX Falcon 9 రాకెట్ శకలాలు వెస్ట్ పసిఫిక్ ప్రాంతంలోని వాషింగ్టన్ మరియు ఒరెగాన్ ప్రదేశాలలో వెలుగులు జిమ్ముతూ కనిపించినట్టు ‘Space.com’ వెబ్ సైట్ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో హిందూ మహాసముద్రంలో ఇటివల కూలిపోయిన చైనా ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ కి సంబంధించింది కాదని చెప్పవచ్చు.

వీడియో-2 (ఆర్కైవ్డ్):

‘ABN Telugu’ కూడా తమ యూట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియోని అప్లోడ్ చేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక సోషల్ మీడియా యూసర్ తన ఇన్స్టాగ్రామ్ పేజిలో ఫిబ్రవరి 2021లో షేర్ చేసినట్టు తెలిసింది. వీడియోలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు SpaceX Starship రాకెట్ కి సంబంధించినవి అని ఈ యూసర్ వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క అధికారిక వివరాల కోసం వెతకగా, SpaceX Starship ప్రోటోటైప్ రాకెట్ కుప్పకూలిన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘Al Jazeera’ పబ్లిష్ చేసిన వీడియో దొరికింది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలతో పోలి ఉండటాన్ని మనం గమనించవచ్చు. అమెరికా SpaceX కంపెనీకి చెందిన Starship ప్రోటోటైపు రాకెట్, 02 ఫిబ్రవరి 2021 నాడు కుప్పకులినట్టు ‘The New York Times’ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది.  ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటివల కూలిపోయిన చైనా ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ కి సంబంధించింది కాదని చెప్పవచ్చు.

వీడియో-3 (ఆర్కైవ్డ్):

ఆకాశం నుండి ఒక మీటియార్ భారీ శబ్దాలు చేస్తూ ఆస్ట్రేలియా బీచ్ లో పడినట్టు ఒక యూసర్ ఈ వీడియోని 16 అక్టోబర్ 2016 నాడు తన యూట్యూబ్ లో పబ్లిష్ చేసారు. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఆ ఘటనకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం వెతకగా, ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన ఒక న్యూస్ ఆర్టికల్ దొరికింది. ఆస్ట్రేలియా విక్టోరియా బీచ్ లో భారీ శబ్దాలు చేస్తూ ఆకాశం నుండి మీటియార్ పడినట్టు ఈ ఆర్టికల్ తెలిపింది. ఈ వీడియో తీసిన వ్యక్తి, ఆకాశం నుండి భారీ శబ్దాలు చేస్తూ ఒక మీటియార్ ఆస్ట్రేలియా బీచ్ లో పడిందని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో హిందూ మహాసముద్రంలో ఇటివల కూలిపోయిన చైనా ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ కి సంబంధించింది కాదని చెప్పవచ్చు.

చైనా దేశం 29 ఏప్రిల్ 2021 నాడు ప్రయోగించిన ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ యొక్క శకలాలు, ఇటివల నియంత్రణ కోల్పోయి హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ శకలాలు ఆకాశంలో ప్రయాణిస్తున్న దృశ్యాలు మిడిల్ ఈస్ట్ దేశాలలో కనిపించినట్టు పలు న్యూస్ వెబ్ సైట్స్ వీడియోలు పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కాని, హిందూ మహాసముద్రంలో ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ కూలిపోయిన దృశ్యాలని ఏ యొక్క న్యూస్ వెబ్సైటు పబ్లిష్ చేయలేదు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోలని చూపిస్తూ హిందూ మహాసముద్రంలో చైనా ‘లాంగ్ మార్చ్5బి’ రాకెట్ కూలిపోతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll